మహేష్ పబ్ సాంగ్... స్సెషల్ కెమెరాతో చిత్రీకరణ
సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇక్కడ వేసిన సెట్‌లో పబ్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ కోసం ప్రత్యేకమైన 12 ఎంఎం రెడ్ ఎపిక్ కెమెరా ఉపయోగిస్తున్నారు. ముంబై నుంచి తెప్పించిన ఈ కెమెరాను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు హాండిల్ చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ అయ్యేలా చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్‌పై 'దూకుడు' నిర్మాతలు అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట్, రామ్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇక్కడ పాట చిత్రీకరణ పూర్తయ్యాక యాక్షన్ ఎపిసోడ్స్ ఏప్రిల్ 27వ తేదీ నుంచి మొదలు పెట్టడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సిక్స్ ప్యాక్‌తో లెక్చరర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో మంచి అనుభవం ఉన్న సుకుమార్ మహేష్ బాబు ఇమేజ్ కు తగిన విధంగా ఈచిత్రాన్ని రూపొందింస్తున్నారు.
ఈ సినిమాతో పాటు మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











