రోబో సాయంతో తెరపైకి 'ఈగ'

By Srikanya

రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' అంతటా బారీ ఎత్తున విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ముప్పై రెండు కోట్లు వరకూ ఖర్చు అయిందని చెప్తున్న ఈ చిత్రంలో రోబోని వాడారని సమాచారం. ఈగ సీన్స్ చిత్రీకరించటం కోసం రోబో ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో రోబో ని నిజమైన ఈగ లాగ గ్రాఫిక్స్ సాయింతో మార్చారు. ఈ రోబో కోసం చాలా ఆధునికమైన పరికరాలు,ఇప్పుడు వరకూ తెలుగు పరిశ్రమ ఉపయోగించనవి వాడాల్సి వచ్చింది.

రాజమౌళి. ఫేస్ బుక్,ట్విట్టర్,మీడియా,టీవీ ఛానెల్స్ అనే తేడా లేకుండా ఈ చిత్రాన్ని భారీ లెవల్లో పబ్లిసిటీ చేస్తున్నారు. ఆయన తాజాగా ఈ చిత్రం కధ గురించి చెబుతూ తమ చిత్రం నాని, బిందుల మధ్య లవ్ స్టోరీ అన్నారు. నాని పాత్రలో నాని,ఇందు పాత్రలో సమంత నటిస్తోంది అన్నారు. మధ్యలో సుదీప్ పాత్ర ప్రవేసించి ఏమి చేసిందనేదే కథ అంటున్నారు.

ఆయన మాటల్లోనే... ఆ అబ్బాయి పేరు నాని. పెళ్లీడు వచ్చేసిన కుర్రాడు. ఓ రోజు ఇందు అనే అందాల భామని చూసి మనసు కూడా పారేసుకొన్నాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా మూగగా ఆరాధిస్తాడే తప్ప ప్రేమ విషయం చెప్పడు. ఇదంతా బిందుకీ సరదాగానే ఉంది. ఓ రోజు ధైర్యం చేసి 'ఐ లవ్‌ యూ' చెప్పేద్దాం అనుకొన్నాడు. అప్పుడే కథలోకి మరో పాత్ర ప్రవేశించింది. నాని, బిందుల మధ్య అడ్డుగోడలా నిలిచింది. అతనెవరు? ఈ ప్రేమ కథ ఏ మలుపు తిరిగింది? అనే విషయాలు మా సినిమా చూసి తెలుసుకోవల్సిందే అన్నారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి.

సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. ఈ చిత్రం ప్రారంభం రోజు నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. అపజయం ఎరగని రాజమౌళి చిత్రం కావటం,కొత్త కాన్సెప్టు తో ఈ చిత్రం రూపొందటం,పిల్లలు పెద్దలు తేడా లేకుండా చూడగలిగే కథ కావటం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి, స్టైలింగ్.. రమా రాజమౌళి, ఛాయాగ్రహణం..సెంధిల్ కుమార్, సమర్ఫణ డి.సురేష్ బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X