ఉత్కంఠ: అజ్ఞాతవాసిపై 'మెగా' రిపోర్టు?.. స్క్రీనింగ్‌కు అంతా సిద్దం..

Recommended Video

అజ్ఞాతవాసిపై 'మెగా' రిపోర్ట్ ?

సినిమా వాళ్లకు కాస్త సెంటిమెంట్లు ఎక్కువే. పలానా ప్రదేశంలో ఒక్క సీన్ అయిన షూట్ చేయాలనో!.. లేక పలానా డ్రెస్సులో ఒక్క సీన్ లో అయినా కనిపించాలనో!.. లేక సినిమాను మొదటగా తమ ఆత్మీయులకే చూపించాలనో.. ఇలా రకరకాల సెంటిమెంట్స్.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతీ చిత్రం మొదటగా ఆయన తండ్రి కృష్ణకే చూపిస్తారన్న సంగతి తెలిసిందే. సినిమాపై ఆయన చెప్పే టాక్ అక్షరాలా నిజమవుతుందనేది మహేష్ నమ్మకం. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అన్న మెగాస్టార్ మాటపై గురి. అందుకే 'అజ్ఞాతవాసి' ఫస్ట్ టాక్ ఆయన నుంచే వినాలనుకుంటున్నారు..

మెగా 'స్క్రీనింగ్'..:

మెగా 'స్క్రీనింగ్'..:

జనవరి 10న 'అజ్ఞాతవాసి' ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకు రెండు రోజుల ముందే మెగా కుటుంబం కోసం ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సినిమా చూశాక మెగాస్టార్ ఇచ్చే రిపోర్టుతో సినిమా హైప్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

 మెగా 'టాక్'పై ఉత్కంఠ:

మెగా 'టాక్'పై ఉత్కంఠ:

'అజ్ఞాతవాసి' సినిమాను మెగాస్టార్ కుటుంబంతో కలిసి ప్రత్యేకంగా వీక్షిస్తుండటంతో వారి స్పందన ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా చిరంజీవి ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ అభిమానులను వెంటాడుతోంది. చిరంజీవి గనుక సినిమా 'సూపర్బ్' అన్నారంటే ఫ్యాన్స్ కు ఇక పండుగే.

కాపీ వివాదం..:

కాపీ వివాదం..:

ఓవైపు సినిమా విడుదల దగ్గరపుడుతుంటే.. మరోవైపు కాపీ వివాదం ఈ సినిమాను వెంటాడుతుండటం గమనార్హం. దీంతో నిర్మాతలు కాస్త ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘లార్గో వించ్' అనే సినిమా కాన్సెప్టును స్ఫూర్తిగా తీసుకుని 'అజ్ఞాతవాసి'ని తెరకెక్కించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి నుంచి చిత్ర యూనిట్ ఎలా బయటపడుతుందో చూడాలి.

 ఊపేస్తున్న పాట..:

ఊపేస్తున్న పాట..:

ఇక పవన్ స్వయంగా పాడి యూట్యూబ్ లో వదిలిన 'కొడుకా కోటేశ్వరరావు..' సాంగ్ మూడు మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక రేపో.. మాపో.. రానున్న ట్రైలర్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

 జనవరి 10న విడుదల..:

జనవరి 10న విడుదల..:

హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ హీరోయిన్లుగా నటించారు. ఖుష్బూ, బొమన్‌ ఇరానీ, ఆది పినిశెట్టి, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X