పికె: సచిన్ కోసం స్పెషల్ షో, పోలీసులొచ్చారు (ఫోటోస్)
హైదరాబాద్: అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో ‘3 ఇడియట్స్' లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం ‘పికె'. సంవత్సరానికి పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. కాగా...సినిమా విడుదల సందర్భంగా ప్రముఖుల కోసం స్పెషల్ షోలు వేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లతో మరికొందరు ప్రముఖులు ఈ స్పెషల్ షోకు విచ్చే సినిమా వీక్షించారు. అంతకు ముందు పోలీసుల కోసం కూడా ప్రత్యేకంగా షో వేసారు. ఈ షోకు ముంబైలోని పోలీస్ ఆఫీసర్లు హాజరయ్యారు. పలువురు మహిళా పోలీసులు కూడా ఈ షోకు హాజరయ్యారు.
అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ కలెక్షన్ల రికార్డులను ఈచిత్రం బద్దలు కొడుతుందని అంతా భావిస్తున్నారు. బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు పెట్టారు. అమీర్ ఖాన్ సినిమాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈచిత్రం 300 కోట్లు చాలా ఈజీగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ ఫిల్మ్స్ పతాకంపై రాజ్ కుమార్ హిరానీ, విదువినోద్ చోప్రా, సిద్ధార్థ్ రాయ్ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, బోమన్ ఇరానీ, సౌరభ్ శుక్లా, సంజయ్ దత్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.
స్లైడ్ షోలో ఫోటోలు

సచిన్ టెండూల్కర్
పికె మూవీ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా హాజరైన ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.

ఫ్రెండ్షిప్
అమీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్ ఇద్దరరూ మంచి స్నేహితులు. అందుకే అమీర్ ఆహ్వానం మేరకు ఈ షోకు హాజరయ్యారు.

రాజ్ థాకరే
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ అధ్యక్షుడు రాజ్ థాకరే తన కొండుకు అమిత్ థాకరే, భార్య షర్మిలా థాకరేతో కలిసి ఈ షోకు హాజరయ్యారు.

హిరానీ, అనుష్క
పికె మూవీ స్పెషల్ స్క్రీనింగు సందర్భంగా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, హీరోయిన్ అనుష్క శర్మ ఇలా....

పోలీసులకు కూడా...
పోలీసుల కోసం కూడా పికె మూవీ స్పెషల్ షో వేసారు. మహిళా పోలీసులతో అమీర్ ఖాన్ కరచాలనం.

ఫోటోలకు...
పికె మూవీ స్పెషల్ షో సందర్భంగా పోలీసులతో కలిసి అమీర్ ఖాన్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

డిఫరెంట్ రోల్స్..
పికె చిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ వేషధారణతో ఆకట్టుకోనున్నారు.


Click it and Unblock the Notifications











