»   » పెంచిన రజనీకాంత్ 'రోబో' ధియోటర్స్

పెంచిన రజనీకాంత్ 'రోబో' ధియోటర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్,శంకర్ కాంబినేషన్లో వచ్చిన "రోబో" చిత్రం హైదరాబాద్ లో 78 ధియోటర్స్ లో విడుదలై విజయం ధుంధుబి మ్రోగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మహేష్ ఖలేజా రిలీజ్ కోసంవాటిని 58 కి కుదించారు. ఆ తర్వాత వారం బృందావనం విడుదల కోసం 34 కి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు పండుగ రోజుల్లో విపరీతమైన రద్దీ ఉండటంతో ధియోటర్స్ మరో 20 హైదరాబాద్ లో పెంచారు. అలాగే రాష్ట్రంలోనూ చాలా చోట్ల ధియోటర్స్ లో రోబో ని మళ్ళీ తీసుకు వచ్చారు. తమిళనాడులో అయితే ధియోటర్స్ దగ్గకుండా ఆ హవా అలాగే కొనసాగుతోంది. దీనికి కారణం రిపీట్ ఆడియన్స్ ఉండటమేనని, క్లైమాక్స్ చివరి ఇరవై నిముషాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని డిస్టిబ్యూటర్స్ అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu