పవన్ కొత్త చిత్రం కోసం స్పెషల్ సెట్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం నిమిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓప్రత్యేకమైన సెట్ ని వేయిస్తున్నారు. నిర్మాత బి.విఎస్ ఎన్ ప్రసాద్ దగ్గరుండి ఈ సెట్ ని పర్యవేక్షిస్తున్నారు. ఈ సెట్ లో ఓ పాటను తీయనున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ ని ఈ సెట్ లో ప్రారంభిస్తారు. జనవరి మూడవ వారంలో షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ మొదలువుతుంది. ఇప్పటికి దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం కోసం అదరిపోయే సాంగ్స్ కంపోజ్ చేసాడని,పవన్ చాలా ఉత్సాహంగా ఈ షూటింగ్ పాల్గొనటానకి రెడీ అవుతున్నారు.
ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్‍గా చేస్తోంది. సెకండ్ హీరోయిన్ గా కైరా దత్ దాదాపుగా ఓకే అవడంతో ఓ సమస్య తీరినట్టయింది. ఇప్పటికే పవన్, తివిక్రమ్ కలిసి విదేశాల్లో పర్యటించి సినిమాకు కావాల్సిన లొకేషన్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈచిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు.
అలాగే హీరోయిన్ ప్రణీత ఈచిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా ఎంపికయింది. ప్రణీత ఇప్పటికే ఈ సినిమాకు సైన్ చేసింది. 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత అనంతరం సిద్ధార్థ సరసన 'బావ' చిత్రంలో నటించింది. ఆ తర్వాత 'శకుని' అనే తమిళ డబ్బింగ్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రం పవన్-త్రివిక్రమ్ చిత్రమే.
పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 22 నుంచి హైదరాబాద్‌లో మొదలవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దారు. స్పెయిన్‌లో కొంత మేరకు చిత్రీకరణ చేస్తారు.


Click it and Unblock the Notifications











