మహేష్ బాబును స్తుతిస్తూ ప్రత్యేక సాంగ్

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఇప్పటికే 'పవనిజం' పేరుతో ఓ ప్రత్యేక గీతాన్ని సింగర్ బాబా సెహగల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ను పొగుడుతూ పాడిన ఈ పాట ఆయన అభిమానులకు తెగ నచ్చేసింది. ఇపుడు ఇలాంటి పాటే మరో హీరోపై కూడా రాబోతోంది.

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు స్తుతిస్తూ ఓ ప్రత్యేక సాంగ్ రాబోతోంది. ఈ ప్రత్యేక గీతానికి ప్లాన్ చేసింది మరెవరో కాదు... దర్శకుడు, నిర్మాత మారుతి. మహేష్ బాబుపై రూపొందించిన ఈ ప్రత్యేక గీతాన్ని తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న 'లవ్ యు బంగారం' అనే సినిమాలో మారుతి వినియోగిస్తున్నట్టు సమాచారం.

మహేష్ బాబుపై ప్రత్యేక గీతం పెట్టడం ద్వారా....తన సినిమాకు మంచి పబ్లిసిటీ రావడంతో పాటు, మహేష్ బాబు అభిమానులంతా ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపుతారని, తద్వారా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయనే ఉద్దేశ్యంతో మారుతి ఈ మాస్టర్ ప్లాన్ చేసినట్లు స్పష్టం అవుతోంది.

క్రియేటివ్ కమర్షియల్ -మారుతి టాకీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'లవ్ యు బంగారం'. ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు సమర్పణలో వల్లభ, మారుతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గొవి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాహుల్, రాజీవ్, శ్రావ్య ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. చక్రి సోదరుడు మహిత్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్, కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: గొని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X