»   » చిరంజీవిని బాగానే వాడుకుంటున్నారు, ఏంటో ఆ సర్‌ప్రైజ్?

చిరంజీవిని బాగానే వాడుకుంటున్నారు, ఏంటో ఆ సర్‌ప్రైజ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘టైగర్' చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల నేపషథ్యంలో సందీప్ కిషన్ కొన్నిరోజులుగా చిరంజీవి జపం జపిస్తున్నాడు. మెగా అభిమానులను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నాడు.

జూన్ 24న సాయంత్రం ‘టైగర్' టీం మెగా అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం అంటూ సందీప్ కిషన్ ప్రకటించారు. మరి సందీప్ కిషన్ ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడో తెలియదు కానీ.... ఇదంతా తన టైగర్ మూవీ ప్రమోషన్స్ కోసమే చేస్తున్నాడనేది కాదనలేని వాస్తవం. రియల్ లైఫ్ లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ అయిన సందీప్ కిషన్....ఈ సినిమాలో కూడా చిరంజీవి అభిమానిగా నటిస్తున్నాడు.


Special surprise for all Chiranjeevi fans

వారణాసి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన చిత్రం 'టైగర్'. రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా 'ఠాగూర్' మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాల తుది దశకు చేరుకున్నాయి. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించారు.


'ఠాగూర్' మధు మాట్లాడుతూ - ''ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. హీరోగా సందీప్ కిషన్ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం అవుతుంది. అన్నివర్గాల వారూ చూడదగ్గ విధంగా చిత్రం ఉంటుంది. అత్యధిక థియేటర్లలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం'' అన్నారు.


Special surprise for all Chiranjeevi fans

తనికెళ్ల భరణి, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, పృథ్వీరాజ్. సుప్రీత్, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరా: ఛోటా కె. నాయుడు, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: రాము, ఆఫీస్ ఇన్ చార్జ్: భగ్గా రామ్, కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, లైన్ ప్రొడ్యూసర్: జి. నాగేశ్వరరావు.

English summary
Sundeep Kishan hinted that Tiger team is going to give a special surprise for all Chiranjeevi fans this evening. He confirmed the same by tweeting “Have a special surprise for all Megastar Fans this evening :) from #Tiger team :)”.
Please Wait while comments are loading...