‘పుష్ప’ నుంచి ఊహించని సర్‌ప్రైజ్: ఈ రెండింటిలో ఒకటి గ్యారెంటీ.. ముందే బయటకొచ్చిందిగా!

బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగిన అతడు.. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక, గత ఏడాది ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న బన్నీ.. ప్రస్తుతం 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రాబోయే స్పెషల్ సర్‌ప్రైజ్ ముందే లీకైంది. వివరాల్లోకి వెళ్తే...

లేటైనా భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్

లేటైనా భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్

'నా పేరు సూర్య' తర్వాత చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఆలస్యం అయినప్పటికీ.. గత ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'అల.. వైకుంఠపురములో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడతను. ఈ భారీ మూవీ అద్భుతమైన స్పందనతో హిట్ టాక్‌ను అందుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫలితంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

లెక్కల మాస్టారుతో పాన్ ఇండియన్

లెక్కల మాస్టారుతో పాన్ ఇండియన్

'అల' హిట్ తర్వాత మాంచి జోష్ మీద ఉన్నాడు అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే గతంలో తనతో 'ఆర్య', 'ఆర్య2' వంటి చిత్రాలను తెరకెక్కించిన సుకుమార్‌తో ప్రస్తుతం 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది.

 పుష్ప కోసం అల్లు అర్జున్ ప్రయోగాలు

పుష్ప కోసం అల్లు అర్జున్ ప్రయోగాలు

భారీ బడ్జెట్‌తో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతుండడంతో 'పుష్ప' మూవీ కోసం అల్లు అర్జున్ ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. ఇందులో గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటించనున్న అతడు.. లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అలాగే, చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడబోతున్నాడు. డీ గ్లామర్‌గా ఉండే ఈ రోల్ కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

తప్పుకున్న స్టార్ హీరో.. ఎవరొస్తారు?

తప్పుకున్న స్టార్ హీరో.. ఎవరొస్తారు?

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్‌ పాత్రకు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేశారు. అయితే, ఆయన అనూహ్యంగా ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. దీంతో మరో స్టార్ కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురి పేర్లు తెరపైకి వచ్చినా ప్రకటన మాత్రం రాలేదు.

పుష్ప రేంజ్ పెంచబోతున్న యూనిట్

పుష్ప రేంజ్ పెంచబోతున్న యూనిట్

'పుష్ప'ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. కానీ, ఈ చిత్రాన్ని మొత్తం పది భాషల్లో రిలీజ్ చేయాలని అల్లు అర్జున్ అండ్ టీమ్ భావిస్తోందని ఇటీవల ఓ న్యూస్ వైరల్ అయింది.. యూనివర్శల్ కంటెంట్ కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రేంజ్ పెరిగినట్లైంది.

Recommended Video

Master Movie : Lokesh Kanagaraj లాంటి దర్శకుడికి అందరూ సపోర్ట్ చేయాలి.. | Thalapathy Vijay
‘పుష్ప' నుంచి సర్‌ప్రైజ్.. రెండింట్లో ఒకటి

‘పుష్ప' నుంచి సర్‌ప్రైజ్.. రెండింట్లో ఒకటి

తాజా సమాచారం ప్రకారం.. 'పుష్ప' సినిమా యూనిట్ నుంచి ఈరోజు (గురువారం) షడన్ సర్‌ప్రైజ్ రాబోతుందట. అనౌన్స్‌మెంట్ లేకుండానే ఓ విషయాన్ని రివీల్ చేయబోతున్నారని ముందే బయటకు వచ్చింది. ఇందులో విలన్ పేరును కానీ, సినిమా రిలీజ్ డేట్‌ను కానీ ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఈ అప్‌డేట్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X