twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెట్టె తెరిచారు: సావిత్రి జయంతి స్పెషల్ ‘మహానటి’ సర్‌ప్రైజ్ ఇదే

    By Bojja Kumar
    |

    ప్రముఖ తెలుగు నటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' సినిమాను తెరకెక్కిస్తున్నారు. బుధవారం సావిత్రి జయంతి సందర్బంగా సర్‌ప్రైజ్ ఇవ్వబోతేన్నట్లు ముందే ప్రకటించిన చిత్ర టీం.... సాయంత్రం ఆ సర్‌ప్రైజ్ ఏమిటనేది పెట్టెతెరిచి చూపించారు.

    ఆ సర్‌‌ప్రైజ్ ఇదే

    ఆ సర్‌‌ప్రైజ్ ఇదే

    సావిత్రి జయంతి సందర్భంగా సర్‌ప్రైజ్ అనగానే ఏం విడుదల చేయబోతున్నారో అని అభిమానులంతా ఆసక్తి గా ఎదురు చూశారు. ఈ వీడియోలో ‘మహానటి' టైటిల్ లోగోతో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మార్చి 29, 2018న సినిమా విడుదల కాబోతోంది.

    డిఫరెంటుగా ఉంది

    ‘మాయాబజార్' సినిమాలో వాడిని ప్రియదర్శిని అనే పేటికను ఉపయోగించి.... బ్యాగ్రౌండ్లో సావిత్రి నటించిన వివిధ సినిమాల్లోని డైలాగులు ప్లే చేస్తూ వీడియో చివరి వరకు ఉత్కంఠ రేపుతూ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఈ వీడియో చాలా డిఫరెంటుగా రూపొందించారు.

    ముఖ్యపాత్రల్లో

    ముఖ్యపాత్రల్లో

    ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషిస్తుండగా జమున పాత్రను సమంత చేస్తోంది. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనుండగా, ఎస్వీఆర్ పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, క్రిష్ లాంటి వారు కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తున్నారు.

    అంచనాలు భారీగా

    అంచనాలు భారీగా

    సావిత్రి తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. అందుకే ఈచిత్రాన్ని కూడా ఏక కాలంలో రెండు భాషల్లో చిత్రీకరిస్తున్నారు. మార్చి 29,2018న సినిమా విడుదల ప్లాన్ చేశారు. ఈ లోగా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటివి ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    On the auspicious eve of Mahanati Savitri birth anniversary, Movie team unveil the logo of Mahanati. It is such a privilege to make a biopic of the one and only Mahanati Savitri, an iconic actress we were ever blessed with. Starring Keerthy Suresh, Dulquer Salmaan, Samantha Akkineni, Vijay Deverakonda, Prakash Raj, Krish Jagarlamudi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X