twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR నుంచి అదిరిపోయే అప్‌డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్‌ప్రైజ్ అదే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). బాహుబలి వంటి సూపర్ డూపర్ హిట్ సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే సినిమా నుంచి అప్‌డేట్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా RRR నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ రాబోతుంది. ఈ మేరకు హీరోలు గుడ్ న్యూస్ చెప్పారు. ఆ వివరాలు మీకోసం!

    Recommended Video

    #RamaRajuForBheem : Komaram Bheem NTR Teaser, Jr.NTR RRR First Look | #BheemforRamaraju, #RRR

    టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)

    పోరాట యోధుల కథతో రూపొందుతోన్న RRR

    పోరాట యోధుల కథతో రూపొందుతోన్న RRR

    విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి గానూ, జూనియర్ ఎన్టీఆర్.. కొమరం భీంగానూ నటిస్తున్నారు. ఐదు భాషల్లో రూపొందుతోన్న ఈ భారీ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం ఇస్తున్నారు.

    చాలా మిగిలింది... అసలైనది మొదలు పెట్టారు

    చాలా మిగిలింది... అసలైనది మొదలు పెట్టారు

    టాలీవుడ్ హిస్టరీలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై రెండేళ్లకు పైగానే అవుతోంది. అయినప్పటికీ పలుమార్లు ఆగిపోవడం వల్ల ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తవలేదు. ఎంతో ముఖ్యమైన కాంబినేషన్ సీన్స్‌తో పాటు ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చిత్రీకరించలేదు. వీటిలో ఇటీవలే క్లైమాక్స్ సీన్ షూటింగ్ మొదలైంది.

    ఏది వచ్చినా బద్దలే.. ఆ రెండు వీడియోలు టాప్

    ఏది వచ్చినా బద్దలే.. ఆ రెండు వీడియోలు టాప్

    భారీ చిత్రం కావడంతో RRR (రౌద్రం రణం రుధిరం)పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే చిత్ర యూనిట్ సస్పెన్స్ కొనసాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొదటిగా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' విడుదలయ్యాయి. ఈ రెండూ రికార్డులు క్రియేట్ చేశాయి.

    మూవీపై కరోనా ఎఫెక్ట్.. వాళ్లను కూడా తాకింది

    మూవీపై కరోనా ఎఫెక్ట్.. వాళ్లను కూడా తాకింది

    కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సినిమా షూటింగులు ఆగిపోవడం.. థియేటర్లు మూతపడడంతో ఎంతో నష్టం వాటిల్లింది. ఇది RRR మూవీపై భారీగా పడిందనే చెప్పాలి. దీనికితోడు, రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇటీవల చిత్ర హీరో రామ్ చరణ్‌కు కూడా పాజిటివ్ వచ్చింది.

    రెండు సార్లు సాధ్యం కాలేదు.. కొత్తది ఎప్పుడు?

    రెండు సార్లు సాధ్యం కాలేదు.. కొత్తది ఎప్పుడు?

    వాస్తవానికి RRRను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించే సమయంలోనే ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడై ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ట్వీట్లతో గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్.. చరణ్

    ట్వీట్లతో గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్.. చరణ్

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా RRR నుంచి ఓ సర్‌ప్రైజ్ వచ్చే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే తాజాగా యూనిట్ నుంచి అప్‌డేట్ వచ్చింది. 25వ తేదీ అంటే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మీరెంతగానో ఎదురు చూస్తున్న అప్‌డేట్ రాబోతుందని ప్రకటించింది. దీన్ని చిత్ర హీరోలు ఎన్టీఆర్, చరణ్ ట్వీట్ల ద్వారా తెలియజేశారు.

    RRR నుంచి అదిరిపోయే అప్‌డేట్... అదేనా?

    RRR నుంచి అదిరిపోయే అప్‌డేట్... అదేనా?

    RRR యూనిట్ ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. రిపబ్లిక్ డే సందర్భంగా అదిరిపోయే వీడియో రెడీ చేశారట. గత రెండు వీడియోల్లో విడివిడిగా కనిపించిన హీరోలు.. ఇందులో జంటగా కనిపించనున్నారని అంటున్నారు. ఇది దేశ భక్తితో కూడిన వీడియో సాంగ్ కూడా అవ్వొచ్చన్న టాక్ వినిపిస్తోంది. దీంతో దీనిపై ఆసక్తి నెలకొంది.

    English summary
    RRR is an upcoming 2021 Indian Telugu-language period action film written and directed by S. S. Rajamouli. It stars N. T. Rama Rao Jr., Ram Charan, Alia Bhatt and character actor Ajay Devgn.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X