twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీ ఆశయమే మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది: సింగర్ శ్రావని బాలెపు (ఇంటర్వ్యూ)

    ఉమెన్స్ డే సందర్భంగా టాలీవుడ్ అప్ కమింగ్ సింగర్ శ్రావని బాలెపు ఇంటర్వ్యూ

    |

    మీ ఆశయమే మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది: సింగర్ శ్రావని బాలెపు (ఇంటర్వ్యూ)

    తన శృతిని మధురమైన స్వరంతో కలిపి అందరిని ఆకట్టుకుంది. తన స్వరంతో ఎదలోతుల్లో మధురమైన ముద్ర వేసి తన స్వరానికే ప్రత్యేకత ఏర్పరుచుకుని... "కన్నా నిన్ను వొదిలి" అంటూ యదను తట్టి లేపినా.." నేను మనిషే" అంటూ మనసును మెలిపెట్టి కన్నీళ్లు తెప్పించినా అది ఆమె స్వరానికే సాధ్యమైంది.
    ప్రముఖ రచయత చంద్రబోస్ గారి చేత ప్రశంసలు అందుకున్న గాయని "శ్రావణి బాలెప్" గారు.త్వరలో రిలీజ్‌కి సిద్దమైన "గీతాపురి కాలనీ"లో కూడా ఆమె పాటలు పాడింది.. ఉమెన్స్ డే సందర్భంగా "ఒన్ ఇండియా.కామ్" పలకరించగా ఆమె చెప్పిన విశేషాలు.. మీ కోసం..

     శ్రావణి గారు

    శ్రావణి గారు "గీతాపురి కాలనీ"లో పాడిన పాటలు "కన్నా నిను వొదిలి" మరియు "నేను మనిషే" సోషల్ మీడియాలోనూ బయట శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ?

    చాల సంతోషంగా ఉందండి.. చాలా మంది నచ్చి మెచ్చుకుంటున్నారు. ఆడియో ఫంక్షన్‌లో చంద్రబోస్ గారు ప్రత్యేకంగా పాటలు విని మెచ్చుకోవడం చాలా గొప్పగానూ ఆనందంగాను.. లైఫ్ లో మరిచిపోలేన స్మృతులు మిగిల్చింది.

    అసలు మీకు పాటలు పాడాలి అనే ఇంట్రెస్ట్ ఎందుకు ఎప్పుడు కలిగింది ?

    అసలు మీకు పాటలు పాడాలి అనే ఇంట్రెస్ట్ ఎందుకు ఎప్పుడు కలిగింది ?

    కళలతో ఎక్కువ అనుబందం ఉన్న ఫ్యామిలీ , మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల్లో నేను పెద్దదానిని మా చెల్లల్లు ఇద్దరు కూడా బాగా పడేవారు. మా నాన్న ఒక్క పెద్ద జానపద గాయకుడు కావడం వలన మమ్మల్ని బాగా సపోర్ట్ చేసేవారు అలా నాకు పాటల మీద ఆసక్తి కలిగింది.

    ఇంత చక్కని గొంతు ఇన్నాళ్లు ఏమయిపోయింది ?

    ఇంత చక్కని గొంతు ఇన్నాళ్లు ఏమయిపోయింది ?

    నవ్వుతూ... చిన్నపటి నుంచి మా నాన్నగారు ఎక్కడికి పాడేందుకు వెళ్ళినా నన్ను కూడా అక్కడికి తీసుకొని వెళ్లేవారు. నేను కూడా ఆయనతో జానపద, మెలోడీ పాటలు ప్రతీ ఒక పాటను పడేదానిని ఆలా నాకు పాటలు పాడడం మీద మక్కువ ఏర్పడి ఎప్పటికైనా మంచి ప్లే బ్యాక్ సింగర్ కావాలి అని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూ చివరకు బందూక్ అనే సినిమా ద్వారా పాటలు పాడే అవకాశం దొరికింది

     మీకు

    మీకు "గీతపురి కాలనీ" చిత్రంలో పాడే అవకాశం ఎల్లా దొరికింది ?

    నేను మొదట కార్తీక్ కడకొండ్ల సంగీత దర్శకుడిగా వచ్చిన బందూక్ చిత్రంలో పాడిన పాటను విన్న గీతపురి కాలనీ సంగీత దర్శకుడు రాంచరణ్ గడిచెర్ల నాకు అవకాశం ఇచ్చారు. అలాగే చిత్ర దర్శకులు శ్రీనివాస్ గారు నన్ను ఎంతో సపోర్ట్ చేసారు.

    మీ ఇంటి నుంచి మీకు సపోర్ట్ వుంటుందా ?

    మీ ఇంటి నుంచి మీకు సపోర్ట్ వుంటుందా ?

    పెళ్లై బాబు పుట్టిన తరవాత అసలు పాటలు మళ్లీ పాడుతానో లేదా అనుకున్నా కానీ మా వారు నాకు బాగా సపోర్ట్ చేశారు.సాంగ్స్ రికార్డింగ్ వుంటే ఆయన ఇచ్చే ప్రోత్సాహం వల్ల నాకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదురు కాలేదు.

    మీరు యూట్యూబ్ ద్వారా సింగర్‌గా బాగా ఫేమస్ కదా ?

    మీరు యూట్యూబ్ ద్వారా సింగర్‌గా బాగా ఫేమస్ కదా ?

    హా...! అవును నేను యూట్యూబ్‌లో చాల పాటలు పాడి అప్లోడ్ చేశాను. నాకు బందూక్ అనే చిత్రంలో అవకాశం రావడానికి కారణం కూడా యోట్యూబ్ అని చెప్పుకోవొచ్చు. నా యూట్యూబ్ ఛానల్ శ్రావణీబాలేపు అని ఉంటుంది అందులో నా పాటలని వినొచ్చు.

    "గీతపురి కాలనీ" చిత్రంలో మీరు పాడిన తరవాత ఇంకా ఏమైనా చిత్రాలలో నుంచి ఆఫర్స్ వచ్చాయా మీకు ?

    వచ్చాయి ఇంకా మూడు చిత్రల నుంచి కబురొచ్చింది యాంకర్ శ్రీముఖి తమ్మడు నటిస్తున్న చిత్రంలో ఈ మధ్యనే పాడాను అలాగే ఇంకా రెండు పెద్ద సినిమాలలో పాడబోతున్నాను.

    మీరు ఒక్క గాయని మాత్రమే కాక దర్శకురాలు అలాగే ఒక్క రచయత్రి అని కూడా విన్నాము ...! ?

    మీరు ఒక్క గాయని మాత్రమే కాక దర్శకురాలు అలాగే ఒక్క రచయత్రి అని కూడా విన్నాము ...! ?

    పెద్ద సినిమాలు ఏం తీయలేదు కానీ ఈ మధ్య నే ఒక లఘు చిత్రం తీశాను. దాని పేరు "అపురూపం" దానిని యూటుబ్‌లో అప్లోడ్ చేశాక చాలామంది బాగా తీసావ్ అని మెచ్చుకున్నారు. అలాగే కొన్ని స్క్రిప్ట్‌లు కూడా రాసాను నేను ఖాళీగా వున్నపుడు స్క్రిప్ట్స్ రాస్తూ వుంటాను

    మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అయినా ఉన్నారా ?

    మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అయినా ఉన్నారా ?

    నేను చిన్నపటి నుంచి మా నాన్నగారిని చూస్తూ పెరిగాను అయినా పట్టుదల, క్రమశిక్షణ , నిజాయతి ఇవన్నీ నేను ఆయన నుంచి అలవర్చుకోగలిగాను నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఆయన వల్లనే నేను ఇపుడు ఒక్క గాయనిగా ఎదుగుతున్నాను ఆయనే నాకు ఇన్స్పిరేషన్.

     ఇపుడే కొత్త ఇండస్ట్రీలోకి వస్తున్న నూతన గాయని గాయకులకి మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా ?

    ఇపుడే కొత్త ఇండస్ట్రీలోకి వస్తున్న నూతన గాయని గాయకులకి మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా ?

    నేను అపుడే వాళ్ళకి సూచనలు ఇచ్చే అంత స్థాయికి రాలేదు అని నా అభిప్రాయం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను మీరు ఏది అయితే ఆశయం పెట్టుకున్నారో దాని కోసం పాటుపడితే అదే మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది.

    మీ బాల్యం, మీ చదువు గురించీ....

    మీ బాల్యం, మీ చదువు గురించీ....

    మాది ఒక్క చిన్న ఫామిలీ మా అమ్మ నాన్న నాకు ఇద్దరు చెల్లెలు మేము పుట్టింది ఖమ్మం డిస్ట్రిక్ట్ డోర్నకల్ లో నేను అక్కడే రైల్వే స్కూల్ లో ఎస్ఎస్సి వరకు చదువుకున్నాను ఆ తరువాత ఖమ్మం కి వొచ్చేసాము నాన్నగారు బీసన్ల్ లో ఎంప్లాయ్ అవడం వాళ్ళ మాకు ట్రాన్స్ఫర్స్ అయ్యాయి ఆలా ఖమ్మం వొచ్చిన తరవాత ఇంటర్మీడియట్ .ఇంజనీరింగ్ ఎం.టెక్ కూడా కంప్లీట్ చేశాను చాల చోట్ల ఉద్యోగ ఆఫర్లు వొచ్చిన కూడా సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉండడం వాళ్ళ జాయిన్ అవలేదు

    మీరు ఇంకా ఎన్నో మంచి పాటలు పడుతూ మంచి స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

    మీరు ఇంకా ఎన్నో మంచి పాటలు పడుతూ మంచి స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము


    మీరు ఇంకా ఎన్నో మంచి పాటలు పడుతూ మంచి స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు
    నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు.. థాంక్స్ టు "ఒన్ ఇండియా"
    ఇంటర్వ్యూ: వంశీకృష్ణ గొట్టిపాటి (వన్‌ఇండియా.కాం)

    English summary
    Tollywood Singer Singer Sravani Balepu chit chat With Filmibeat
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X