ఈ వార్తలు వింటూంటేనే బుర్ర తిరిగిపోతోంది : ఒక్క సీన్ కోసం 25 కోట్లు
Recommended Video

బాహుబలి అనే సినిమా తో ఒక్కసారిగా మొత్తం సీన్ మారిపోయింది. మామూలు టాలీవుడ్ హీరో కాస్తా జాతీయ స్థాయి నటుదయ్యాడు. ఇప్పుడు అదే రేంజ్ లో తన తర్వాతి సినిమాలు కూడా ఉండాలి కదా. అందుకే ఖర్చు విషయం లో ఏమాత్రం వెనక్కితగ్గటం లేదు "సాహో" టీమ్. ఇప్పటికే సాహో బడ్జెట్ 150 కోట్లు.

ఖరీదైన లొకేషన్లు
ఇంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సాహో మూవీని ఇండియాలోనే కాకుండా ఖరీదైన లొకేషన్లు అబుదాబి, రొమేనియా వంటి ప్రాంతాలలో చిత్రీకరణ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. కత్తి ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

150 కోట్ల బడ్జెట్
ప్రభాస్ కెరీర్లో ఇది 19వ సినిమా. రూ. 150 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నపుడు అందుకు తగిన విధంగానే మార్కెటింగ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. నిర్మాతలు అవన్నీ బేరీజు వేసుకుని మరీ ఇంత బడ్జెట్ పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని బట్టి చూస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే పెట్టుబడులు చేతికి వచ్చేస్తాయన్న ధీమాతో ఉన్నారు.

హాలీవుడ్‌కి ఏమాత్రం తీసిపోకుండా
ఈ చిత్రం వర్ధమాన చిత్రాల్లో ఒక సంచలనమయ్యేలా వుండాలని ప్లాన్ చేసారు. దర్శకుడు సుజిత్‌కి పెద్ద సినిమా తీసిన అనుభవం లేకపోయినా కానీ అతనిపై నూట యాభై కోట్ల ప్రాజెక్ట్ బాధ్యతని మోపారు. యాక్షన్ సీన్లు హాలీవుడ్‌కి ఏమాత్రం తీసిపోకుండా తీయడానికి సుజిత్ ప్లాన్ చేస్తున్నాడు.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌తో
ఇందులో ఇరవై నిమిషాల పాటు సాగే ఒక ఛేజ్ సీక్వెన్స్‌ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌తో చేయిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్స్‌కి పని చేసిన నిపుణులు దీనికి వర్క్ చేస్తున్నారు. ఈ సీన్ కోసమే పాతిక కోట్లకి పైగా ఖర్చు పెడుతున్నారట. పాతిక కోట్లంటే ఏ మీడియం రేంజ్ హీరోతో అయినా ఒక భారీ బడ్జెట్ సినిమా తీసేయవచ్చు.

రిచ్ మేకింగ్
చిన్న సినిమాలైతే ఏడెనిమిది తీసేసుకోవచ్చు. అంతెందుకు యువి సంస్థ శర్వానంద్‌తో తీసిన ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు రెండిటి బడ్జెట్ కలిపి పాతిక కోట్లు వుండదు. దీనిని బట్టి ఒక సీన్‌కే ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం చేసుకోండిక. ఇంత రిచ్ మేకింగ్ తెరమీద ఇంకెంత రిచ్ గా కనిపిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











