రామ్ తో కాజల్ సయ్యాట
దేవదాసు చిత్రంతో పరిచయమైన హీరో రామ్ రెడీ, మస్కా లాంటి చిత్రాలతో ఘనవిజయాన్ని సాంధించి, సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకొన్నాడు. ఇప్పుడు మరో చిత్రంతో హిట్ ను కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం ద్వారా శరవన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీ స్రవంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ 'గణేష్" రామ్ కెరీర్ ని మరో మెట్టు ముందుకు తీసుకెళ్తుందని అంటున్నారు.
రామ్ సరసన కాజల్ అగర్వాల్ ఈ గణేష్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ స్విట్జర్లాండ్లో జరిగినప్పుడు కాజల్ తెగ ఎంజాయ్ చేసిందట. రామ్, తనూ కలిసి మంచు పర్వతాలు ఎక్కిన సమయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని కాజల్ అగర్వాల్ అంటోంది.
ganesh ram kajal maska redy sravanthi ravi kishore saravanan రామ్ గణేష్ కాజల్ స్రవంతి రవి కిషోర్ రెఢీ శరవనన్


Click it and Unblock the Notifications