స్టార్ డైరక్టర్ స్పీల్‌బర్గ్ లేటిస్ట్ సినిమా దేనిమీదంటే...
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్వీల్ బర్గ్ తాజాగా మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సారి సబ్జెక్టుగా మొదటి ప్రపంచ యుధ్దాన్ని ఎన్నుకున్నాడు. ఇంతకుముందు జూరాసిక్ పా ర్క్, ఇటి, మైనార్టీ రిపోర్టు వంటి ఎన్నో అద్భుతాలను తెరకెక్కించి ఉండటంతో ఈ కొత్త చిత్రంపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అలాగే మైఖేల్ మోపర్గో అనే రచయిత రాసిన 'వార్ హౌ స్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ చిత్రం నిర్మాణ హక్కులను ఆయన తన నిర్మాణ సంస్ధ ద్వారా కొనేసారు. అలాగే 'బిల్లీ ఎ లియట్' సినిమాకు పనిచేసిన లీహాల్‌ను ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాయాల్సిందిగా కోరాడు. 1982 లో రాసిన వార్‌హౌస్ పుస్తకంలో..ఒక అబ్బాయి, ఓ గుర్రం మొద ట్లో కలిసి తర్వాత విడిపోతారు. కానీ, మొదటి ప్రపంచయుద్ధ స మయంలో అనుకోకుండా కలుస్తారు. ఈ పుస్తకం చదవగానే తీ స్తే ఇలాంటిదే తీయాలనుకున్నానని, ఇది చూడగానే ప్రతిదేశస్థులూ తమ సొంత కథలాగే దీన్ని భావిస్తారని స్పీల్‌బర్గ్ అన్నారు.మొత్తానికి మరో అవతార్ లాంటి చిత్రం రాబోతోందన్నమాట. అయితే తెలుగులోనూ డబ్బింగ్ అవుతుంది కాబట్టి చూసేయచ్చు.


Click it and Unblock the Notifications











