టికెట్ లేకుండా ఫ్రీగా సినిమా చూడొచ్చు, జూన్ 13న

By Bojja Kumar

హైదరాబాద్: టికెట్ లేకుండా థియేటర్లకు వెళ్లే రోజులు రాబోతున్నాయి. ఈ తరహా సినిమా ప్రదర్శనకు ఓ మళయాళ నిర్మాత శ్రీకారం చుడుతున్నారు. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే చాలావరకు సినిమాలను ఉచితంగానే చూడొచ్చు. ఎస్.వినోద్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'టెస్ట్ పేపర్' అనే సినిమాను ఇలా ఉచితంగా అందించాలని ఆ సినిమా నిర్మాత మనోజ్ కుమార్ భావిస్తున్నారు.

జూన్ 13న ఈ సినిమా విడుదల అవుతోంది. టిక్కెట్ లేకుండా సినిమా అనే ప్రయత్నాన్ని ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా కొన్ని థియేటర్లలో మాత్రం చేపడుతున్నారు. సినిమా ప్రదర్శనకు అయ్యే ఖర్చులను ప్రకటనల ద్వారా రాబట్టేలా నిర్మాత మనోజ్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు.

'Sponsored Screening' Arriving with 'Test Paper'

ఇప్పటి వరకు టీవీ సీరియళ్లు, ఇతర టీవీ కార్యక్రమాలు మాత్రమే స్పాన్సర్ చేయించడం మనం ఉచితంగా చూస్తున్నాం. కానీ భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా స్పాన్సర్ చేయడం ద్వారా చూడబోతున్నాం. అలా అని టీవీల్లో మాదిరి మాటి మాటికి ప్రకటనలు వచ్చి విసుగిస్తాయని మాత్రం భయపడొద్దు.

సీరియళ్లలో అయితే ఎప్పుడు పడితే అప్పుడే మధ్యలో ప్రకటనలు వస్తాయి. కానీ సినిమాలో మాత్రం అలా కాకుండా, మొదట్లోను, ఇంటర్వెల్ సమయంలోను మాత్రమే ప్రకటనలు ఇస్తారు. టెస్ట్ పేపర్ సినిమాలో జగదీష్, నందు, మున్నా, మహాలక్ష్మి లాంటి ప్రముఖ నటులున్నారు. ప్రస్తుతానికి పెద్దపెద్ద బ్రాండ్ల కంటే స్థానిక ప్రకటనల మీదే తాము దృష్టి పెట్టామని నిర్మాత తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X