షర్ట్ విప్పేసిన గంగూలీ.. రియలైజ్ అయిన అమ్మాయి

2002 సంవత్సరంలో నాట్ వెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ పై భారత్ సాధించిన విజయం క్రీడాభిమానులకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ మ్యాచ్ లో భారత్ విజయకేతనం ఎగరేయగానే సంతోషం పట్టలేని గంగూలీ తన చొక్కా విప్పేసి గాల్లో ఎగరేయడం టీమ్ అభిమానుల్లో జోష్ నింపింది. భారత్ గెలుపుపై గంగూలీ ఫీలింగ్స్ చూసి తెగ మురిసిపోయారు క్రికెట్ ప్రేక్షకులు. ఇప్పటికీ ఆ క్లిప్పింగ్ క్రీడాభిమానులు వద్ద స్టోర్ అయ్యే ఉంది.

సరిగ్గా అదే అంశాన్ని తీసుకొని ఓ ఇన్స్పైరబుల్ మూవీ తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అభినయ్ దేవ్. 'దూస్రా' అనే పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. 'లిప్ స్టిక్ అండర్ మై బుర్కా' ఫేమ్ ప్లబితా ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. 2 నిమిషాల 3 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్ లో గంగూలీ చొక్కా విప్పే సన్నివేశం హైలైట్ గా నిలుస్తోంది. ఈ సన్నివేశం చూసి ఓ యువతి ఎలా ఇన్స్పైర్ అయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు.

Sports Drama Film Doosra Trailer released

గంగూలీ తెగువ చూడగానే ప్రేరణ పొందిన ఆ యువతి వెంటనే రియలైజ్ అయి సామజిక కట్టుబాట్లపై ఎలా పోరాటం చేసిందనేది ఈ చిత్రంలో చూడొచ్చు. 1947లో రాజకీయ స్వాత్రంత్రం వచ్చింది.. 1991లో ఆర్థిక స్వాతంత్రం వచ్చింది.. 2002లో భావోద్వేగాల స్వాతంత్రం వచ్చింది అంటూ ట్రైలర్ లో బ్యాగ్ గ్రౌండ్ లో వినిపిస్తున్న డైలాగ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X