రణబీర్-కత్రినా...కొత్త ఇంట్లో దిగారు (ఫోటో లీక్)

By Bojja Kumar

హైదరాబాద్: రణబీర్, కత్రినా గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం నుండి ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ 2015లో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత వ్యవహారం నడుస్తున్నా, విషయం మీడియా ద్వారా అందరికీ తెలిసినా ఇద్దరూ తమ మధ్య ఉన్న బంధాన్ని మాత్రం అఫీషియల్‌గా బయట పెట్టడం లేదు.

ఇద్దరూ కలిసి ఉండటానికి ముంబై కార్టర్ రోడ్‌లో ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసినట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో వెలుతున్న ఫోటో ఒకటి ముంబైకి చెందిన ప్రముఖ దిన పత్రిక బయట పెట్టింది. ఇపుడు ఈ ఫోటో ఇంటర్నెట్లో వైరల్‌లా వ్యాపించింది. ఈ ఇంటిని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్, ఆర్కిటెక్ట్ ఆశీష్ షాతో డిజైన్ చేసినట్లు సమాచారం. సకల సౌకర్యాలతో ఎంతో లగ్జరీగా ఈ ఇల్లు ఉందని, రెండు టెర్రస్‌లు, స్విమ్మింగ్ ఫూల్ తదితర సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.

SPOTTED: Ranbir-Katrina Together At Their New House

తాజాగా లీకైన ఫోటోతో....రణబీర్, కత్రినా మధ్య ఉన్న ఎఫైర్ విషయంపై మరింత స్పష్టత వచ్చినట్లయింది. గత కొంత కాలం క్రితం పరిస్థితి పరిశీలిస్తే....ఇద్దరూ ఏకాంతంగా గడపడానికి ఇండియాలో పరిస్థితులు అనుకూలించక పోవడంతో విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసిన విషయం ఫోటోలు లీక్ కావడం ద్వారా బట్టబయలైన సంగతి తెలిసిందే. అప్పట్లో అదో సంచలనం. తాజాగా ఇద్దరూ ముంబైలో ఒకే ఇంట్లో సహజీవనం చేస్తుండటం ఇద్దరి వ్యవహారం మరింత ముందుకెళ్లినట్లయింది.

వీరి వివాహానికి ఇటు రణబీర్ ఫ్యామిలీతో పాటు అటు కత్రినా ఫ్యామిలీ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. తొలుత రణబీర్ తండ్రి రిషి కపూర్ కాస్త అభ్యంతరం తెలిపినా తర్వాత కొడుకు కోరికను కాదనలేక పోయారట. అన్నీ ఓకే అయితే 2015 ఫిబ్రవరి కల్లా వీరి వివాహ మహోత్సవం జరుగొచ్చని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X