twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒళ్లు గగుర్బొడిచే క్యారెక్టర్: స్పైడర్ మూవీలో భైరవుడు హాట్ టాపిక్

    స్పైడర్ మూవీలో భైరవుడు పాత్ర హాట్ టాపిక్. ఈ సైకో విలన్ పాత్రను ఎస్.జె.సూర్య పోషించారు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    స్పైడర్ మూవీలో భైరవుడు హాట్ టాపిక్, ప్రతి మనిషిలోనూ సైకోయిజం ఉంటుంది.

    మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' మూవీ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా శివ పాత్రలో మహేష్ బాబు చార్మింగ్ లుక్, ఇంటలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో అతడి పెర్పార్మెన్స్‌తో పాటు..... భైరవుడుగా సైకో విలన్ పాత్ర పోషించిన ఎస్.జె.సూర్య గురించి హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు.

    'స్పైడర్' సినిమా చూసిన తర్వత ప్రేక్షకులకు ఎక్కువ కాలం గుర్తిండిపోయే పాత్ర ఏది అంటే... చాలా మంది తడముకోకుండా 'బైరవుడు' పాత్రే అని చెబుతున్నారు. ఇలాంటి సైకో పాత్రను ఇప్పటి తాము చూడలేదంటున్నారు.

    ఒళ్లు గగుర్బొడిచే క్యారెక్టర్

    ఒళ్లు గగుర్బొడిచే క్యారెక్టర్

    ‘స్పైడర్' మూవీలో భైరవుడు సైకో క్యారెక్టర్ ఒళ్లు గగుర్బొడిచేలా ఉందని, ఆ పాత్రకు ఎస్.జె.సూర్య పూర్తి న్యాయం చేశారనే వాదన వినిపిస్తోంది. అలాంటి క్యారెక్టర్‌ను రియల్ లైఫ్‌లో ఊహించుకోవడం కూడా కష్టమే.

    ప్రతి మనిషిలో సైకోయిజం

    ప్రతి మనిషిలో సైకోయిజం

    ప్రతి మనిషిలోనూ సైకోయిజం ఉంటుంది. సాధారణ వ్యక్తుల్లో ఇది 4 శాతం ఉంటుంది. కొందరిలో 6 శాతం ఉంటుంది. అయితే ‘స్పైడర్' మూవీలో భైరవుడి పాత్రలో సైకోయిజం 15 శాతం ఉంది. అందుకే అతడి పాత్ర అంత క్రూరంగా, కిరాతకంగా ఉంది.

    పాత్ర మలిచిన తీరు సూపర్

    పాత్ర మలిచిన తీరు సూపర్

    బైరవుడి పాత్ర ఎలా పుట్టింది, అతడు అలా తయారవ్వడానికి కారణం ఏమిటి అనే వివరాలు మురుగదాస్ స్క్రీన్ మీద చూపించిన తీరు చాలా అద్భుతంగా ఉంది.

    స్మశానంలో పుట్టి

    స్మశానంలో పుట్టి

    సినిమాలో భైరవుడు తండ్రి కాటి కాపరి. అమ్మకడుపులో 9 నెలలు ఉన్నపుడే స్మశానంలో చనిపోయిన వారి బంధువుల ఆర్థనాదాలు, ఏడుపులు వింటూ పెరుగుతాడు. అమ్మ కడుపు నుండి భూమి మీద పడ్డ క్షణంలో అతడు విన్న శబ్దం కూడా ఏడుపే. అలా ఎదుటి వారు ఎవరైనా చనిపోయి ఏడుస్తుంటే చూసి ఎంజాయ్ చేసే మెంటాల్టీతో పెరుగుతాడు బైరవుడు.

    ఆరేళ్ల వయసులోనే హత్యలు

    ఆరేళ్ల వయసులోనే హత్యలు

    కొన్నిసార్లు ఊర్లో చావులు లేక స్మశానం వెలవెల పోతోంది. చావు ఏడుపులు వింటే తప్ప తిండి కూడా సహించని మనస్తత్వం భైరవుడిది. అతడి ప్రవర్తన చూసి తల్లిదండ్రులు కూడా విస్తుపోతారు. ఈ క్రమంలోనే భైరవుడు ఆనందం కోసం హత్యలు చేయడం మొదలు పెడతాడు.

    ఆ సంఘటనతో తీవ్ర రూపం

    ఆ సంఘటనతో తీవ్ర రూపం

    బైరవుడు ఊర్లో హత్యలు చేస్తున్న విషయం తెలిసి... కాటికాపరి కుటుంబాన్ని అంతమొందించాలని గ్రామస్తులంతా కలిసి రాత్రిపూట వెళ్లి ఇంటికి నిప్పు పెడతారు. ఆ సమయంలో పాస్ చేయడానికి బయటకు వచ్చిన భైరవుడు, అతడి తమ్ముడు తప్పించుకుంటారు. తమ కళ్లముందే తల్లిదండ్రులను చంపిన గ్రామస్తులపై కక్ష పెంచుకున్న బైరవుడు ఊర్లో మరిన్ని హత్యలు చేస్తాడు.

    వయసు పెరిగే కొద్దీ పరాకాష్టకు

    వయసు పెరిగే కొద్దీ పరాకాష్టకు

    భైరవుడి వయసు పెరిగే కొద్దీ అతడిలోని సైకోయిజం పరాకష్టకు చేరుతుంది. ఆనందం కోసం అనేక దారుణమైన హత్యలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడు ఇంటలిజెన్స్ ఆఫీసర్ శివ దృష్టిలో పడతాడు.

    ఆసక్తికరం...

    ఆసక్తికరం...

    భైరవుడి ఆటకట్టించేందుకు శివ చేసే ప్రయత్నాలు, వేసే ఎత్తులు చాలా ఆసక్తికరంగా చూపించారు. శివ(మహేష్ బాబు), భైరవుడు(ఎస్.జె.సూర్య) మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

    English summary
    Bhairavu character impressive in Spyder movie. There’s a poor family that lives next to a graveyard. The head of the family works as an undertaker, albeit reluctantly. His eldest son Bhairavu, though, does not seem to have any problems with his father’s job or their living conditions. The father is stunned to see the boy rejoice when there’s a funeral. A continuous long spell of no deaths leads to loss of income for the family and the boy is determined to put an end to it. But the reasons aren’t what one would imagine. All this forms the backstory of Bhairavudu (SJ Surya), the antagonist in AR Murugadoss’ bilingual film Spyder.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X