‘స్పైడర్’ సెకండ్ సాంగ్ ‘పుచ్చకాయ పుచ్చకాయ’ సూపర్...

స్పైడర్ మూవీ నుండి మరో పాట రిలీజైంది. హాలీ హాలీ పేరుతో ఈ సాంగ్ రిలీజ్ చేశారు.

By Bojja Kumar

Recommended Video

"Spyder" Second Song Haali Haali Released

మహేష్ బాబు హీరోగా ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తోన్న స్పైడ‌ర్ సినిమా నుంచి మరో సాంగ్ 'హాలి హాలి' రిలీజైంది. 'పుచ్చకాయ పుచ్చకాయ' అంటూ లిరిక్స్‌తో ఈ పాట అభిమానులను, సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

స్పైడ‌ర్ లో మహేష్ బాబు స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. 'హాలి హాలి పాట విడుదలైంది... ఎంజాయ్' అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. విభిన్న క‌థాంశంతో మురుగ‌దాస్ రూపొందిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

సాంగ్ ఇదే..

‘హాలీ హాలీ' పాటను బ్రిజేష్ త్రిపాటి సాండిల్య, హరిణి, సునిత కలిసి పాడారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించారు. రాజమజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. పుచ్చకాయ పుచ్చకాయ అంటూ లిరిక్స్ తో సాగు ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

స్పైడర్

స్పైడర్

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా ఎస్.జె.సూర్య నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు.

క్రేజ్

క్రేజ్

మహేష్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌ మొదటి సారి కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో స్పెషల్‌ క్రేజ్‌ ఏర్పడింది. ఇటీవల విడుదలైన టీజర్ మంచి స్పందన వచ్చింది.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X