twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘స్పైడర్’: నాన్ బాహుబలి రికార్డ్ బ్రేక్ చేయలేక పోయిన మహేష్ బాబు

    ‘స్పైడర్’ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. తెలుగు, తమిళంలో కలిసి రూ. 23.5 కోట్లు డీల్ ఓకే అయింది.

    By Bojja Kumar
    |

    మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విబాషా చిత్రం 'స్పైడర్'. ఈ మూవీ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. భారీ మొత్తానికే అమ్ముడు పోయినప్పటికీ ఓవర్సీస్ మార్కెట్లో నాన్ బాహుబలి రికార్డ్స్‌ విషయంలో అగ్రస్థానంలో ఉన్న 'కబాలి'ని అధిగమించలేక పోయింది.

    ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న సౌత్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. యూఎస్, యూకె లాంటి దేశాల్లో ఆయన నటించిన 'శ్రీమంతుడు' చిత్రం భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో త్వరలో రాబోతున్న 'స్పైడర్' మూవీపై ఓవర్సీస్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు, తమిళంలో ఈచిత్రం తెరకెక్కుతుండటం, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం కావడంతో అంచనాలు బాగా పెరిగాయి.

    స్పైడర్

    స్పైడర్

    స్పైడర్ మూవీ వరల్డ్ వైడ్ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వివిధ ఏరియాల్లో థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయాయి. ఓవర్సీస్ మార్కెట్లో ‘స్పైడర్' థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడానికి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడ్డాయి.

    Recommended Video

    Spyder Movie First Song 'Boom Boom'
    టోటల్ 23.50 కోట్లు

    టోటల్ 23.50 కోట్లు

    ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 'ATMUS Entertainment ' తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ. 15.5 కోట్లకు, AZ India వారు తమిళ థియేట్రికల్ రైట్స్ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రెండు వెర్షన్లకు కలిపి ఓవరాల్‌గా రూ. 23.5 కోట్లు వచ్చాయి.

    బాహుబలి-2 నెం.1

    బాహుబలి-2 నెం.1

    రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 2' మూవీ ఓవర్సీస్ మార్కెట్లో థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 64 కోట్లు రాబట్టింది. సౌత్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్. రజనీకాంత్ ‘కబాలి' మూవీ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 35 కోట్లు వసూలు చేసింది.

    బ్రేక్ చేయలేక పోయిన స్పైడర్

    బ్రేక్ చేయలేక పోయిన స్పైడర్

    నాన్ బాహుబలి సినిమాల్లో ‘కబాలి' నమోదు చేసిన రూ. 35 కోట్ల రికార్డును మహేష్ బాబు ‘స్పైడర్' మూవీ బ్రేక్ చేస్తుందని అంతా భావించారు. కానీ ‘స్పైడర్' మూవీ 23.50 కోట్లు రాబట్టింది.

    ‘స్పైడర్' అనేది స్పై థ్రిల్లర్ మూవీ.

    ‘స్పైడర్' అనేది స్పై థ్రిల్లర్ మూవీ.

    ఇంటలిజెన్స్ బ్యూరో ఆఫీర్ శివ చుట్టు కథ తిరుగుతుంది. ఇండియాలో బయోలాజికల్ వార్, బయోటెర్రరిజాన్ని అరికట్టేందుకు శివ ప్రయత్నిస్తుంటాడు. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. మహేష్ బాబు స్పై ఏజెంటుగా ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ అతని ప్రియురాలి పాత్ర పోషిస్తోంది.

    English summary
    AR Murugadoss' Spyder starring Mahesh Babu has earned Rs 23.50 crore for its overseas theatrical rights, but it has failed to beat Rajinikanth's Kabali, which holds the non-Baahubali 2 record.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X