For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్‌‌కు కొంచెం కష్టం.. కొంచెం ఇష్టం.. అందుకే దారుణంగా.. స్పైడర్ పోస్ట్ మార్టమ్..

  By Rajababu
  |
  Reasons Behind "Spyder" Movie Flop

  తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన చిత్రం స్పైడర్. ప్రిన్స్ మహేశ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంపై ఎన్నడూ లేనంతగా చర్చ జరిగింది. మహేశ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 27న రిలీజైన ఈ చిత్రంపై డివైడ్ టాక్ వచ్చింది. తొలి వారాంతంలో కలెక్షన్లపరంగా దూసుకెళ్లి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే వారాంతం తర్వాత నమోదవుతున్న కలెక్షన్లు కొంత నిరాశగానే ఉన్నట్టు ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విడుదలకు ముందు ఊహించినట్టుగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడానికి కారణాలు ఇవే అని వినిపిస్తున్నాయి.

   యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా

  యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా

  125 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ స్ఠాయిలో సినిమా రూపొందిస్తున్నాం. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి అని ప్రమోషన్ సందర్భంగా ఊదరగొట్టారు. తీరా తెరమీద చూస్తే హాలీవుడ్ స్ఠాయి ప్రమాణాలు ఎక్కడ కనిపించవు. దాంతో ప్రేక్షకుల్లో నిరాశ అలుముకున్నాయి.

   సైంటిఫిక్ చిత్రమనే రేంజ్‌లో

  సైంటిఫిక్ చిత్రమనే రేంజ్‌లో

  ఇక టీజర్లు, ట్రైలర్లలో రోబో స్పైడర్‌ను చూపించి ఈ చిత్రం సైంటిఫిక్, యాక్షన్ థ్రిల్లర్ అనే భావన కల్పించారు. అయితే సైడర్ చిత్రంలో అలాంటి ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో ఓ వర్గం ప్రేక్షకులు కంగుతిన్నారు. ట్రైలర్‌లో చూసిన రోబో స్పైడర్ ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురు చూసిన చిన్నారులకు నిరాశనే పంచింది ఈ సినిమా.

  మహేశ్ ఇమేజ్‌కు దూరంగా

  మహేశ్ ఇమేజ్‌కు దూరంగా

  టాలీవుడ్‌లో మహేశ్ బాబుకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ప్రిన్స్ చిత్రాల్లో హీరోయిజానికి పెద్ద పీట ఉంటుంది. అందుకే మహేశ్ చిత్రం అంటే ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. స్పైడర్‌కు సంబంధించి హంగులు, హీరోయిజం లాంటి అంశాలు ఏ కోశానా కనిపించవు.

   మహేశ్ కంటే ఎస్ జే సూర్య

  మహేశ్ కంటే ఎస్ జే సూర్య

  స్పైడర్ చిత్రంలో హీరో మహేశ్ బాబు పాత్ర కంటే విలన్ ఎస్ జే సూర్య రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఎస్ జే సూర్య ముందు మహేశ్ తేలిపోవడం అభిమానులు, ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.

   క్యాస్టూమ్స్ మైనస్

  క్యాస్టూమ్స్ మైనస్

  స్పైడర్ చిత్రంలో మహేశ్ బాబు వేసుకొన్న దుస్తులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. పాటల్లో అయితే అది మరింత కొట్టొచ్చినట్టు కనిపించింది. దాంతో అభిమానులు సినిమాతో కనెక్ట్ కాలేకపోయారు. గ్లామర్‌గా మహేశ్ కనిపించనప్పటికీ దస్తులు అంతగా ఆకర్షణీయంగా లేకపోవడం మరో మైనస్ పాయింట్.

  పేలవంగా పాటలు, సంగీతం

  పేలవంగా పాటలు, సంగీతం

  మహేశ్ బాబు సినిమాల్లో యాక్షన్‌కు, డైలాగ్స్‌కు ఎంత బలం ఉంటుందో అంతే మొత్తంలో పాటలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. స్పైడర్ చిత్రంలో పాటలు చాలా పేలవంగా ఉన్నాయి. అంతేకాకుండా తెరపైనా పాటలు నాసిరకంగా కనిపించాయి. ఆడియోలోనే సంగీతం ఆకట్టుకోలేకపోయింది.

  హ్యారీస్ జైరాజ్ సినిమాలు ఫ్లాపే..

  హ్యారీస్ జైరాజ్ సినిమాలు ఫ్లాపే..

  టాలీవుడ్‌లో సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్‌‌కు పెద్దగా ట్రాక్ రికార్డు లేదు. హ్యారీస్ నేరుగా సంగీతం అందించిన తెలుగు చిత్రాలు దాదాపు అట్టర్ ఫ్లాపులుగా మారాయి. స్పైడర్ విషయంలో అదే అనవాయితీ కొనసాగింది.

  నామమాత్రంగానే రకుల్

  నామమాత్రంగానే రకుల్

  హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రిన్స్ మహేశ్ మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రంలో జీరో. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎక్కడా పండినట్టు కనిపించదు. సినిమాలో ఏదో హీరోయిన్ ఉంది అనే భ్రమ కల్పించడానికి రకుల్‌ను మధ్య మధ్యలో ఇరికించినట్టు అనిపిస్తుంది.

   ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ మైనస్

  ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ మైనస్

  స్పైడర్ ప్రమోషన్ సందర్భంగా హీరో, దర్శకులు, కెమెరామెన్, స్టంట్ మాస్టర్లు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి అని చెప్పారు. అయితే ఆ సన్నివేశాలు చాలా పేలవంగా ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

   బూడిదలో ఎస్ జే సూర్య పాత్ర

  బూడిదలో ఎస్ జే సూర్య పాత్ర

  ఇలాంటి బలహీనతల మధ్య విలన్ ఎస్ జే సూర్య పాత్ర మాత్రమే స్పైడర్ సినిమాకు బలంగా మారింది. అనేక ప్రతికూల అంశాల మధ్య సూర్య పాత్ర బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. శ్మశానం సీన్లు బాగా ఉన్నప్పటికీ అవి తెలుగు నేటివిటికి దూరంగా.. తమిళ వాతావారణానికి దగ్గరగా ఉండటం టాలీవుడ్ ప్రేక్షకులకు రుచించలేదు.

  English summary
  SPYder features Rakul Preet as the female lead and actor-director SJ Suryah plays the antagonist. Harris Jayaraj has composed the music for the film. This movie released between huge expectations. But some sections are not happy with the way Mahesh Babu role potrayed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X