twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ఇది మామూలు రికార్డ్ కాదు: స్పైడర్ యూ ట్యూబ్ రికార్డ్

    సినిమా టీజర్ కు కేవలం ఒక రోజులో 60లక్షల 30వేల వ్యూస్ రావడం ఓ రికార్డు.అయితే ఆ రికార్ద్ అక్కడే ఆగలేదు నెల క్రితం 'గ్లిమ్స్ ఆఫ్ స్పైడర్' పేరుతో రిలీజైన ఈ టీజర్ యూట్యూబ్‌లో 13,259,068 వ్యూస్‌ను సాధించి.

    |

    టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' తాజా సినిమా 'స్పైడర్' కోసం చాలా మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీజర్ ఎప్పుడు విడుదలవుతుందా ? అని ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. ఒక్కరోజులోనే స్పైడర్ సంచలనం అయ్యింది. ఈ టీజర్ కు కేవలం 24 గంటల్లోనే 6.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

    రోజులో 60లక్షల 30వేల వ్యూస్

    రోజులో 60లక్షల 30వేల వ్యూస్

    ఒక సినిమా టీజర్ కు కేవలం ఒక రోజులో 60లక్షల 30వేల వ్యూస్ రావడం ఓ రికార్డు.అయితే ఆ రికార్ద్ అక్కడే ఆగలేదు నెల క్రితం 'గ్లిమ్స్ ఆఫ్ స్పైడర్' పేరుతో రిలీజైన ఈ టీజర్ యూట్యూబ్‌లో.. కోటి ముఫ్ఫై లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది. ఇప్పటి వరకూ ఈ రికార్ద్ మామూలు విజయం కాదు మహేష్ సినిమా కొసం ఎంత ఎదురు చూస్తున్నారో దీన్ని బట్టి తెలుస్తోంది.

    Recommended Video

    Mahesh babu disappointed on Spyder Movie Delay
    స్పైడర్ ద మూవీ

    స్పైడర్ ద మూవీ

    యూట్యూబ్ వ్యూస్ విషయాన్ని పక్కనపెడితే.. 'స్పైడర్' పబ్లిసిటీ కోసమే చిత్ర నిర్మాతలు.. యూట్యూబ్‌లో 'స్పైడర్ ద మూవీ' పేరుతో ఓ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఛానెల్‌కు ఇప్పుడు ఏకంగా లక్షకు పైగా సబ్ స్క్రైబర్స్ రావడమే సరికొత్త రికార్డ్‌గా మారింది. రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేసే పేరున్న యూట్యూబ్ ఛానెల్స్‌కు కూడా.. ఇంతమంది సబ్ స్క్రైబర్స్ రావడానికి సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అలాంటిది మహేశ్ 'స్పైడర్' యూట్యూబ్ ఛానెల్.. నెలరోజుల్లోనే ఈ ఫీట్ సాధించిందన్నమాట.

    కరణ్ జోహార్

    కరణ్ జోహార్

    మహేష్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం 'స్పైడర్'. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం ఈ చిత్రం హిందీ రిలీజ్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ చేతికి వెళ్లినట్లు సమాచారం.

    మహేష్ బాలీవుడ్ మార్కెట్

    మహేష్ బాలీవుడ్ మార్కెట్

    నైజాంలో దిల్ రాజు బేనర్ కు ఎంత పేరుందో బాలీవుడ్లో కరణ్ జోహార్ బేనర్‌కు అంతే పేరుంది. అందుకే హిందీలో భారీ వసూల్లు రాబట్టాలనే ఉద్దేశ్యంలో కరణ్ జోహార్ కు ఈ చిత్రం హిందీ హక్కులు అప్పగించినట్లు సమాచారం. అయితే హిందీలో ఇప్పటి వరకూ ఊహించినంత బజ్ రాలేదు గానీ మహేష్ బాలీవుడ్ మార్కెట్ కి తొలి అడుగు బలంగా వేయటానికి ఈ సినిమా కీలకం కానుంది.

    English summary
    The highly anticipated first teaser of Mahesh Babu’s Spyder has clocked 13,259,068 million views, registering a new record among Telugu releases.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X