»   » స్పైడర్ టీజర్ భేష్.. రాజమౌళి ప్రశంసల జల్లు.. ఏమన్నారంటే..

స్పైడర్ టీజర్ భేష్.. రాజమౌళి ప్రశంసల జల్లు.. ఏమన్నారంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి తర్వాత అంతగా ఎదుచుసూస్తున్న చిత్రం స్పైడర్. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, ప్రిన్స్ మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గురించి అభిమానులు వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రిన్స్ మహేశ్‌బాబు, చిత్ర నిర్మాతలు జూన్ ఒకటో తేదీన స్పైడర్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆ టీజర్‌కు యూట్యూబ్‌లో అనూహ్య స్పందన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పైడర్ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు.

చాలా ఆసక్తిని రేపుతున్నది..

స్పైడర్ అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది. టీజర్ చాలా ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది. టీజర్‌లో మహేశ్‌బాబు స్క్రీన్ ప్రజెన్స్ హైలెట్‌గా ఉంది. టీజర్‌లో స్పైడర్ మహేశ్‌బాబు పెంపుడు జీవిగా కనిపించడం చాలా బాగుంది అని రాజమౌళి ట్వీట్ చేశారు. గతంలో రాజమౌళి ఈగను ఆధారంగా చేసుకొని సమంత, నానీలతో ఓ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.


సెప్టెంబర్‌కు వాయిదా..

సెప్టెంబర్‌కు వాయిదా..

స్పైడర్ చిత్రం వాస్తవానికి జూన్ 23న రిలీజ్ కావాల్సింది. సాంకేతిక విభాగాలకు సంబంధించిన పని పూర్తికాకపోవడంతో స్పైడర్ రిలీజ్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. దాంతో ఎంతో జోష్ మీద అభిమానులకు నిరుత్సాహం కలిగింది. ఈ నేపథ్యంలో తాజాగా స్పైడర్ టీజర్‌ను రిలీజ్ చేసి సంతోషాన్ని నింపారు.


రూ.110 కోట్ల వ్యయంతో..

రూ.110 కోట్ల వ్యయంతో..

స్పైడర్ చిత్రం ప్రిన్స్ మహేశ్ కెరీర్‌లోనే ముందెన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. రూ.110 కోట్లతో తీసున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ప్రిన్స్ సరసన అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నది. ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.


బయో టెర్రిరిజం నేపథ్యంగా

బయో టెర్రిరిజం నేపథ్యంగా

ఈ చిత్రం బయోటెర్రరిజం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. యూట్యూబ్‌లో సైడర్ చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఒక్క రోజులోనే దాదాపు 5 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ఈ టీజర్‌పై సినీ వర్గాల నుంచే కాకుండా అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.English summary
After the Baahubali phenomenon, superstar Mahesh Babu's Spyder is the most expected Telugu release of this year. Ever since its inception, fans have been madly waiting for Spyder, which marks Mahesh's first collaboration with AR Murugadoss.Now, Baahubali filmmaker SS Rajamouli has praised Spyder teaser. Taking it to Twitter, the Eega director wrote, "Now we understand why it is SPYDER..Very intriguing." The highlight of the teaser is Mahesh Babu's screen presence. The teaser shows Mahesh shooing his pet techie spider.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X