twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భయ పెట్టడం మాకూ తెలుసు... (‘స్పైడర్’ టీజర్ అదుర్స్)

    మహేష్ బాబు ‘స్పైడర్’ కొత్త టీజర్ రిలీజైంది. హీరో పుట్టినరోజు కానుకగా దీన్ని రిలీజ్ చేశారు.

    By Bojja Kumar
    |

    సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. ఆగస్ట్‌ 9 మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా 'స్పైడర్‌' కొత్త టీజర్‌ను విడుదల చేశారు.

    సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ప్రజల ప్రాణాలు బలిగొంటూ వారిలో భయాన్ని పుట్టిస్తున్న ఓ రాక్షసుడి ఆట కట్టించే పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారని తెలుస్తోంది.

    స్టైలిష్ అవతార్

    స్టైలిష్ అవతార్

    మహేష్ బాబు ఈ మూవీలో గత చిత్రాలకంటే స్టైలిష్ గా కనిపించబోతున్నారు. దర్శకుడు మురుగదాస్ తనదైన మేకింగ్ స్టైల్‌తో ఈ చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కించారు.

    విలన్ పాత్రలో ఎస్‌జె సూర్య

    విలన్ పాత్రలో ఎస్‌జె సూర్య

    ఈ చిత్రంలో విలన్ పాత్రలో ఎస్.జె సూర్య నటిస్తున్నారు. ఇప్పటి వరకు దర్శకుడిగా, మామూలు నటుడిగా అందరికీ సుపరిచితమైన ఎస్.జె. సూర్య.... ఈ చిత్రంలో భయంకరమైన విలన్ గా కనిపించబోతున్నారు.

    రొమాన్స్

    రొమాన్స్

    ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఇద్దరి మధ్య జరిగే రొమాన్స్ ప్రేక్షకులను మరింత ఎంటర్టెన్ చేయనుంది. ఈ చిత్రంలో రకుల్ జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది.

    సెప్టెంబర్ 27న రిలీజ్

    సెప్టెంబర్ 27న రిలీజ్

    ఈ సందర్భంగా నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కి రికార్డు స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చింది. ఆగస్ట్‌ 9 మా హీరో మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా మరో టీజర్ విడుదల చేశాం. ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ ఒక్క పాట చిత్రీకరణ ఆగస్ట్‌ 23 వరకు జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. ఆల్‌రెడీ డబ్బింగ్‌, రీకార్డింగ్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 'స్పైడర్‌' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.

    స్పైడర్

    ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

    English summary
    Watch SPYDER Telugu Teaser. The movie is presented by Tagore Madhu in association with NVR Cinema LLP along with Reliance Entertainment Production. Mahesh Babu, Rakul Preet and SJ Suriya are the main leads. The movie is being Directed by AR Murugadoss, Produced by N.V. Prasad and Music by Harris Jayaraj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X