నేను స్పైడర్ మ్యానో, సూపర్ మ్యానో కాదు.... (స్పైడర్ ట్రైలర్ అదుర్స్)
Recommended Video

సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 27న విడుదలకు సిద్దమవుతోంది.
తాజాగా సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 27న దసరా కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇంటలిజెన్స్ బ్యూరో ఆఫీసర్
ఈ చిత్రంలో మహేష్ బాబు శివ అనే ఇంటలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా నటిస్తున్నాడు. కెరీర్లో తొలిసారిగా మహేష్ బాబు ఇలాంటి పాత్రలో నటిస్తున్నాడు.

స్పైడర్ అనేది ఓ సాఫ్ట్ వేర్
‘స్పైడర్' అనేది ఓ సాఫ్ట్ వేర్ అని తెలుస్తోంది. ఫోన్లో ఎవరైనా బెదిరించినా... ఏడ్చినా, హెల్ప్ అని అడిగినా స్పైడర్ అనే సాఫ్ట్ వేర్ ఆన్ అయి స్క్రీన్ బ్లింక్ అవుతుంది. వెంటనే శివ వెళ్లి వాట ఆటకట్టిస్తాడు.

నేను స్పైడర్ మ్యానో, సూపర్ మ్యానో కాదు
నేను స్పైడర్ మ్యానో, సూపర్ మ్యానో కదు.... ఈ సొసైటీని నేను చేంజ్ చేయడం లేదు... నా పని నేను చేస్తున్నాను అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగుకు మంచి స్పందన వస్తోంది.

రొమాంటిక్ లవ్ ట్రాక్
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య నడిచే రొమాంటిక్ లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోబోతోందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

మేకలకంటే ఎక్కువగా మనుషులు
మేకలకంటే ఎక్కువగా మనుషులు ఉన్నారు, వాళ్లను చంపితే తప్పేంటి అనే ఒక హింసాత్మక ధోరణితో ఇందులో విలన్ కనిపించబోతున్నాడు. ఈ పాత్రలో ఎస్.జె.సూర్య నటిస్తున్నాడు.
స్పైడర్ ట్రైలర్
సూపర్‌స్టార్ మహేష్, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్.


Click it and Unblock the Notifications











