For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SR Kalyanamandapam Twitter Review: ఇద్దరే నిలబెట్టారు.. మూవీ హైలైట్స్ అవే.. అవి లేకుంటే వేరే లెవెల్

  |

  సుదీర్ఘ విరామం తర్వాత గత వారం తెలుగు రాష్ట్రాల్లో సినిమా హళ్లు తెరుచుకున్నాయి. పోయిన శుక్రవారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. దీంతో మరిన్ని సినిమాలను కూడా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 6న మరిన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. అందులో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'ఎస్ఆర్ కల్యాణమండపం' ఒకటి. టీజర్, ట్రైలర్‌తోనే అంచనాలు పెంచుకున్న ఈ సినిమా కోసం తెలుగు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా పలు ప్రాంతాల్లో షోలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో 'ఎస్ఆర్ కల్యాణమండపం' ట్విట్టర్ రివ్యూ మీకోసం!

  Merise Merise movie review.. శ్వేత అవస్థి గ్లామర్.. దినేష్ తేజ్ పెర్ఫార్మెన్స్‌ హైలెట్‌గా

  Ippudu Kaaka Inkeppudu movie review: పెళ్లికి ముందే శృంగారంలో మునిగితే..

  ‘ఎస్ఆర్ కల్యాణమండపం' అంటూ కొత్తగా

  ‘ఎస్ఆర్ కల్యాణమండపం' అంటూ కొత్తగా

  శ్రీధర్ గాదె దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం 'ఎస్ఆర్ కల్యాణమండపం'. ఇందులో ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌గా నటించింది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఇందులో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించారు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రమోద్, రాజు ఈ సినిమాను నిర్మించారు. దీనికి హీరో కిరణ్ అబ్బవరం కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందించాడు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

  అప్పుడే ఆకట్టుకుని.. అంచనాలు భారీగా

  అప్పుడే ఆకట్టుకుని.. అంచనాలు భారీగా

  'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాలో నటించిన పెద్ద పెద్ద స్టార్లు కాదు. కానీ, ఈ సినిమా పేరు కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఈ చిత్రంపై ఏర్పడ్డ అంచనాలే అని చెప్పొచ్చు. ఆ మధ్య విడుదలైన టీజర్, ఇటీవల వచ్చిన ట్రైలరే దీనిపై భారీ స్థాయిలో బజ్‌ను ఏర్పరిచాయి. అందుకే వీటికి రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంతో పాటు ఇది ప్రతి ఒక్కరి కథ అనే టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం యూత్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

   సెన్సార్ రిపోర్టు... ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా

  సెన్సార్ రిపోర్టు... ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా

  'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమా ఇటీవలే సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ రేటింగ్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 28 నిమిషాలు ఉంది. మరోవైపు, భారీ అంచనాలు ఏర్పరచుకున్న 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 4.55 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ దీనికి భారీ ధరే పలికిందని చెప్పొచ్చు. ఇక, ఈ సినిమా నైజాం ఏరియాలో దాదాపుగా 200, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 200 థియేటర్లలో విడుదల అవుతోంది.

  ‘ఎస్ఆర్ కల్యాణమండపం' పాజిటివ్‌గానే

  ‘ఎస్ఆర్ కల్యాణమండపం' పాజిటివ్‌గానే

  'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ యూఎస్‌లో కూడా భారీగానే విడుదల అవుతుంది. అక్కడ దీనికి దాదాపు 30కి పైగానే లొకేషన్లలో స్క్రీన్లు దక్కాయి. ఇక, ఇప్పటికే అక్కడ అన్ని ప్రాంతాల్లో ఈ మూవీ ప్రీమియర్ షోలు పడిపోయాయని తెలుస్తోంది. అక్కడ ఈ సినిమాకు భారీ స్థాయిలో స్పందన వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ మూవీకి అన్ని లొకేషన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాను చూసిన వారంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దీంతో 'ఎస్ఆర్ కల్యాణమండపం'కు గ్రాండ్ ఓపెనింగ్ దక్కేలా ఉంది.

   మొత్తంగా ఈ సినిమాకు వచ్చిన టాక్

  మొత్తంగా ఈ సినిమాకు వచ్చిన టాక్


  'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాకు ట్విట్టర్‌లో మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కథ కథనంలో వేగం లేకపోవడంతో చాలా సందర్భాల్లో బోర్ ఫీలింగ్ వస్తుందని వీక్షకులు అంటున్నారు. అయితే, దీన్ని సాయి కుమార్, కిరణ్ అబ్బవరం తమ యాక్టింగ్‌తో మరిపిస్తారని చెబుతున్నారు. మొత్తంగా 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ ఎమోషనల్‌గా సాగే ఫ్యామిలీ డ్రామా అని చెబుతున్నారు. మరి మిక్స్‌డ్ టాక్ వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఎలా నెగ్గుకుని వస్తుందో చూడాలి.

   ‘కల్యాణమండపం' ప్లస్‌ పాయింట్లు ఇవే

  ‘కల్యాణమండపం' ప్లస్‌ పాయింట్లు ఇవే

  'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాను చూసిన వారంతా కిరణ్ అబ్బవరం, సాయి కుమార్ నటన సినిమాకు హైలైట్ అని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, క్లైమాక్స్ సీన్ కన్నీరు తెప్పించే విధంగా ఉంటుందట. టెక్నికల్ పరంగా చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయని అంటున్నారు. అలాగే, కామెడీ ట్రాక్ కూడా ఈ సినిమాలో ఆకట్టుకునేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. కొన్ని సన్నివేశాలు మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయని సినిమాను చూసిన వాళ్లంతా చెబుతున్నారు.

  ‘కల్యాణమండపం'లోని మైనస్‌లు ఇవే

  ‘కల్యాణమండపం'లోని మైనస్‌లు ఇవే

  'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాలో చాలా మైనస్‌లు ఉన్నాయని సినిమాను చూసిన వాళ్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఇందులో సెకెండాఫ్‌లో కొంత ల్యాగ్ అయినట్లు ప్రేక్షకుల చెబుతున్నారు. అలాగే, కథనం కూడా ఆకట్టుకునేలా లేదట. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ ఏమాత్రం కొత్తగా లేదని ఫీల్ అవుతున్నారు. కొన్ని సన్నివేశాలు మాత్రం సాదాసీదాగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పుంటే బాగుండేదని చెబుతున్నారు.

  Recommended Video

  Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame


  టాలీవుడ్, బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా తాజా వార్తల కోసం, తారల ఇంటర్యూల కోసం, టెలివిజన్ సీరియల్ అప్‌డేట్స్ కోసం, ఫోటో గ్యాలరీల కోసం, సినిమా ఈవెంట్ల కోసం, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణల కోసం.. మీరు వెంటనే ఫేస్‌బుక్ ( https://www.facebook.com/TeluguFilmibeat/) ట్విట్టర్ (https://twitter.com/TeluguFilmibeat), ఇన్స్‌టాగ్రామ్ (https://www.instagram.com/filmibeatteluguofficial/) అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Kiran Abbavaram Now Did a Film SR Kalyanamandapam Under Sridhar Gade Direction. This Movie Released Today. Twitter Review on this occasion is for you.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X