Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 3 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెద్ద ఎన్టీఆర్...వచ్చి జూ.ఎన్టీఆర్ వద్ద నేర్చుకోవాలి
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...సీనియర్ ఎన్టీఆర్ వచ్చి జూ. ఎన్టీఆర్ వద్ద నేర్చుకోవాలంటూ మరో సారి సెన్సేషన్ కామెంట్స్ చేసారు. ట్విట్టర్ వేదికగా ఆయన కామెంట్ల ప్రస్దానం కంటిన్యూగా కొనసాగింది. టెంపర్ లో ఎన్టీఆర్ గురించి ప్రస్దావిస్తూ ప్రసంసలు వర్షం కురిపించారు. ఆయన ట్వీట్ చేస్తూ... సీనియర్ ఎన్టీఆర్ తిరిగి వచ్చి జూ. ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలి అన్నారు.
వర్మ ట్వీట్ చేస్తూ...టెంపర్ చిత్రం చూసిన తర్వాత... తారక్ ...50 సంవత్సరాల ఎన్టీఆర్ ని పడగొట్టారనిపించింది. టెంపర్ చూసిన తర్వాత నాకు నిజంగా అనిపించింది ఏమిటీ అంటే...సీనియర్ ఎన్టీఆర్ తిరిగి వచ్చి...తారక్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి అన్నారు. టెంపర్ ...టెంపరేచర్ రైజ్ చేస్తోందని అన్నారు. ఈ చిత్రం చూసాక నాకు అనిపించింది ఏమిటీ అంటే...సీనియర్ ఎన్టీఆర్ కన్నా...జూనియర్ ముందు పుట్టి ఉంటే..ఆయన కన్నా పెద్ద స్టార్ అయ్యిండేవాడు.
After seeing Temper I truly felt NTR himself should come back and learn lots of things from junior NTR
— Ram Gopal Varma (@RGVzoomin) February 9, 2015
"నేను సినిమాలు చూడటానికి రేర్ గా థియోటర్స్ కి వెళ్తూంటాను.. అయితే నేను భ్రమరాంబకు వెళ్లి 13 వ తేదీ ఉదయం టెంపర్ చిత్రం చూస్తాను..30,40,50 సంవత్సరాల సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఒక్క చిత్రం కూడా టెంపర్ తో ఎన్టీఆర్ చేసిన దానితో పోల్చలేము..సీనియర్ ఎన్టీఆర్ వచ్చి భ్రమరాంబలో ఈ చిత్రం కనుక చూస్తే ఖచ్చితంగా అసూయ పడతారు తారక్ ని చూసి ."
I rarely go to theatre bt wanna watch Temper at bramahraambha 13th mrng at 5 am fr reliving my orgasmic experience of watching Adaviramudu
— Ram Gopal Varma (@RGVzoomin) February 9, 2015
ఇక ‘టెంపర్' రిలీజ్ కి ముస్తాబవుతోంది. ఈ సినిమాకి సంబందించిన ఫైనల్ మిక్సింగ్ ఆలస్యం అవడం వలన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజుకి వాయిదా పడ్డాయి. ఈ సినిమా సెకండాఫ్ కి సంబందించిన ఫైనల్ మిక్సింగ్ పనులు నిన్న సాయంత్రం 5 గంటలకు మొదలయ్యాయి. ఈ రోజు రాత్రికల్లా ఈ ఫైనల్ మిక్సింగ్ ని పూర్తి చేసి ఫస్ట్ కాపీని రెడీ చేయనున్నారు.

ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ రోజు ఉదయం 9 గంటలకు ఈ ఫస్ట్ కాపీని సెన్సార్ వారికి చూపించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కల్లా టెంపర్ సెన్సార్ రిపోర్ట్ బయటకు తెలిసిపోతుంది. మరోవైపు ఫిబ్రవరి 13న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి సారి ఎన్.టి.ఆర్ పూర్తి స్టైలిష్ లుక్ లో, డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ తో ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీకి పూరి జగన్నాధ్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో అందాలా భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తే మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్లభరణి, ఆలీ. పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిశోర్, జయ ప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, పవిత్ర వంటి స్టార్ కాస్టింగ్ అంతా నటించడం కూడా ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు