Kalki 2898 AD: కల్కిలో నటరత్న ఎన్టీఆర్.. రాజమౌళిని ఫాలో అయిన నాగ్ అశ్విన్.. రోల్ ఏంటంటే?

మళ్ళీ చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఆడియెన్స్ సహా పాన్ ఇండియా వీక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్నా తదుపరి సినిమా "కల్కి 2898 ఎడి" చెప్పాలి. గత కొంత కాలం నుంచి టాలీవుడ్ లో సరైన సినిమా లేదు, మరి ఇంత కరువు కాలం తర్వాత వస్తున్నా మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఇతర భాషల్లో కూడా ట్రెండ్ ఈ సినిమా పట్ల చాలా గట్టిగానే ఉంది.

కాగా ఈ చిత్రంని యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా ఈ సినిమా లో భారీ తారాగణం తాను తీసుకున్నాడు. అయితే మొత్తం 3 గంటల సినిమాలో కావాల్సినంత హై మూమెంట్స్ ని నాగ్ అశ్విన్ ఓ రేంజ్ లో ప్లాన్ చేసినట్టుగా కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ వినిపిస్తున్నాయి. అలా ఇప్పుడు వరకు మనకి తెలిసిన తారాగణం కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పదుకొనె అలాగే మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని వరకు తెలుసు.

sr ntr will be seen in this role in kalki 2898 ad

రీసెంట్ గా ట్రైలర్ తో అయితే మాళవిక నాయర్ కనిపించింది. వీరే మనకి తెలిసిన తారాగణం అయితే వీరు కాకుండా ఇంకా చాల పేర్లు ఈ సినిమాలో ఉన్నాయని గట్టి టాక్ వినిపిస్తుంది. కాగా ఇప్పుడు ఇవన్నీ చాలదు అన్నట్టు మరో షాకింగ్ నేమ్ వైరల్ గా మారింది. అలా ఈ సినిమాలో స్వర్గీయ నందమూరి తారకరామారావు కనిపిస్తారు అని రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఇందుకు నాగ్ అశ్విన్ ఇప్పుడు బాగా పాపులర్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయాన్ని తీసుకున్నాడని అంటున్నారు. కాగా దీనితోనే భగవాన్ శ్రీకృష్ణ పాత్రలో ఎన్టీఆర్ గారిని ప్రెజెంట్ చేయనున్నాడని వినిపిస్తుంది. మరి ఈ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ లోగోలో కూడా ఎన్టీఆర్ ఉంటారు. అలా సెంటిమెంట్ గా సినిమాలో కీలక సన్నివేశం కోసం ఇలా ప్లాన్ చేసారాని ఒక షాకింగ్ రూమర్ ఇప్పుడు వైరల్ గా మారింది.

sr ntr will be seen in this role in kalki 2898 ad

మరి గతంలో కూడా సీనియర్ ఎన్టీఆర్ ని జక్కన్న రాజమౌళి గ్రాఫిక్స్ ఉపయోగించి చూపించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ తర్వాత కూడా జక్కన మగధీర లో మెగాస్టార్ చిరంజీవి పాత వీడియోని కట్ ని మగధీర లో రీమాస్టర్ చేసి మాయాజాలం చేశారు. మరి ఈసారి కొంచెం అడ్వాన్స్డ్ గా రాబోతున్న ఈ వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ ఉంటే..

sr ntr will be seen in this role in kalki 2898 ad

కాగా రేపు జూన్ 27న సినిమా భారీ లెవెల్లో రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుండగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రాబోతుంది. అలాగే ఈ సినిమాలో సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా తాను ఈ సినిమా విషయంలో మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాని తన కెరీర్ లోనే స్పెషల్ ప్రాజెక్ట్ గా భావిస్తున్నాడు.

More from Filmibeat

Read more about: sr ntr prabhas kalki 2898 ad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X