అందాలు ఆరబోతే...శ్రద్ధా దాస్ క్యారెక్టర్
ఆర్య 2, మరో చరిత్ర చిత్రాల్లో సెకెండ్ హీరోయిన్ తరహా పాత్రల్లో అలరించిన శ్రద్ధాదాస్ తాజాగా ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ "డార్లింగ్" చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోందని తెలుస్తోంది. కరుణాకరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక శ్రధ్ధాదాస్ మొదట ఈ తరహా నృత్యాలకు ఒప్పుకోకపోయినా హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాకపోవటంతో చివరకు కమిట్ అయ్యిందని చెప్తున్నారు. మరో ప్రక్క నా క్యారెక్టర్ ఏమిటీ అంటే అందాల ఆరబోతేనని డైరక్టగా డైరక్టర్స్ శెలవిస్తున్నారుట. దాంతో మొదట ఆశ్చర్యపోయినా దొరికిన ఛాన్సులను మిస్ చేసుకోవటం ఎందుకనే కాన్సెప్టుతో ముందుకు వెళ్తోందని, అది కూడా ఎక్కువగా హీరోల రికమండేషన్ తోనేనని అంటున్నారు. హీరోలతో ఎక్కువ టచ్ గా ఉండే ఆమెకు ఆర్య 2తోనే క్రేజ్ పెరిగిందని సమాచారం. మొత్తానికి ఆమె కోసం అన్ని చిత్రాల్లో ఒకే తరహా క్యారెక్టర్ తో దర్శక, నిర్మాతలు రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











