తెలుగులో చేసింది గొడవ ఒక్క సినిమానే ఐనా శ్రధ్ద ఆర్య అందరి దృష్టిలో పడి బాగానే రిజిస్టర్ అయింది. దాంతో ఆమెకు ఆఫర్లు వరసలో వస్తున్నాయి. తాజాగా శ్రీహరి ,ఆర్యన్ రాజేష్ కాంబినేషన్ లో నూతన దర్శకుడు రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఒప్పుకుంది. అలాగే రాజశేఖర్ హీరోగా జీవిత నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న సత్యమేవ జయతే చిత్రం లోనూ ఆమెనే ఎంపిక చేసింది. పెద్దగా హిట్టు కూడా కాని సినిమా లో చేసినా ఆమె ఎందుకింత క్రేజి హీరోయిన్ అయిందంటే అందులో ఒక బీచ్ సాంగ్ లో ఆమె రెచ్చిపోయి డాన్స్ చేసింది. అది చూసిన వాళ్ళెవరూ ఆమెను మర్చిపోలేకపోతున్నారట. పువ్వు పుట్టగానే పరమళిస్తుంది అన్నట్లుగా ఆమె కెరీర్ ప్రారంభం లోనే వర్మ దృష్టిలో పడి నిశ్శబ్ద్ లో అమితాబ్ కూతురు వేషం సంపాదించింది. కాని ఆ సినిమా బాలీవుడ్ లో ఆఫర్లు తేకపోయినా కోదండ రామి రెడ్డి దృష్టిలో పడేలా చేసింది. అందులో ఆమె అందాల ఆరపోతే ఇప్పటి ఆమె కెరీర్ కదలికలకు కారణమైంది.