శ్రావణిని పెళ్లి చేసుకోవాలనుకొనలేదు.. కేసుతో సంబంధం లేదు.. నిర్మాత అశోక్ రెడ్డి
టెలివిజన్ నటి శ్రావణి సూసైడ్ కేసులో సినీ నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. శ్రావణి మరణం తర్వాత వెలుగు చూసిన ఆడియో టేప్‌లు కలకలం రేపడంతో అశోక్ రెడ్డి అజాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా ఉన్నారు. అయితే ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు సాయికృష్ణారెడ్డి, దేవరాజ్‌రెడ్డిని మంగళవారం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే అశోక్ రెడ్డిని అనూహ్యంగా అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ...

అశోక్ రెడ్డి అరెస్ట్, వైద్య పరీక్షలు
శ్రావణి మరణం కేసు అనేక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో దేవరాజ్, సాయికృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే విచారణకు హాజరవుతానని చెబుతూ అశోక్ రెడ్డి తప్పించుకు తిరుగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. బుధవారం అదుపులోకి తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు జరిపించి కస్టడీలోకి తీసుకొన్నారు.

పోలీసుల కస్టడీలో నిర్మాత
వైద్య పరీక్షల అనంతరం అశోక్ రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సందర్భంగా మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే అశోక్ రెడ్డి పోలీసులు అదుపులో ఉండగా మాట్లాడానికి నిరాకరించారు. అయినా మీడియా వెంటాడుతూ గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో ముక్తసరిగా స్పందించారు.

శ్రావణి సూసైడ్ కేసుతో సంబంధం లేదు
పోలీస్ స్టేషన్ వద్ద తనను వెంటాడిన మీడియాతో క్లుప్తంగా మాట్లాడిన అశోక్ రెడ్డి.. తాను శ్రావణిని పెళ్లి చేసుకొంటానని చెప్పలేదు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ తన వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అశోక్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు.
Recommended Video

శ్రావణి సూసైడ్ కేసులో ఏ3గా అశోక్ రెడ్డి
టెలివిజన్ నటి శ్రావణి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలతో సాయికృష్ణారెడ్డిని ఏ1గా, దేవరాజ్‌ను ఏ2గా, అశోక్ రెడ్డిని ఏ3గా నిర్ధారిస్తూ కేసు నమోదు చేశారు. అందుకు ముందు అశోక్ రెడ్డిని ఏ2గా చూపించి.. ఆ తర్వాత ఏ3గా మార్చడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో శ్రావణి సూసైడ్ కేసులో సరైన కారణాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











