శ్రావణి సూసైడ్ కేసులో ట్విస్టులు.. దేవరాజ్‌ మెడకు బిగిస్తున్న ఉచ్చు.. సాయిరెడ్డిని కూడా!

టెలివిజన్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ వ్యవహారంలోకి ఊహించిన విధంగా ప్రముఖుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే ప్రియుడు దేవరాజ్, ఫ్యామిలీ ఫ్రెండ్ సాయిరెడ్డి వినిపిస్తున్న కథనాలు అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి. దేవరాజ్‌రెడ్డి, సాయిరెడ్డి చెబుతున్న పొంతనలేని కథనాలపై ఎస్ఆర్ నగర్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మార్చి 9వ తేదీన మనసు మమత, మౌనరాగం సీరియల్స్ ప్రేక్షకాదరణ పొందిన శ్రావణి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం తెలిసిందే. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

దేవరాజ్‌పై ప్రశ్నల వర్షం

దేవరాజ్‌పై ప్రశ్నల వర్షం

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ లొంగిపోయిన దేవరాజ్ రెడ్డిని గురువారం రోజంతా విచారించారు. శ్రావణితో పరిచయం ఎలా జరిగింది. మీ పైనే కేసు ఎందుకు పెట్టింది? ఆమెను ఫోటోలు లీక్ చేస్తానని బెదిరించావా? లాంటి ప్రశ్నలతో సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దేవరాజ్ చెప్పిన విషయాలను తనపై వస్తున్న ఆరోపణలను నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది.

సినీ నిర్మాత ఆడియో టేప్ లీక్

సినీ నిర్మాత ఆడియో టేప్ లీక్

శ్రావణి ఆత్మహత్య తర్వాత ఈ కేసులో ఓ సినీ నిర్మాత పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. శ్రావణితో మాట్లాడిన ఆయన ఆడియో టేప్స్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేవరాజ్‌రెడ్డిపై కేసు పెట్టిన క్రమంలో ఆయన ఇచ్చిన సలహాలు ఆడియో టేప్‌లో ఉన్నాయి. అయితే సదరు నిర్మాతను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్టు పోలీస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్రేమ పేరుతో చీటింగ్, బ్లాక్‌మెయిల్

ప్రేమ పేరుతో చీటింగ్, బ్లాక్‌మెయిల్

సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో పరిచయం పెంచుకొని వారిని వలలో వేసుకొంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న దేవరాజ్‌రెడ్డి వ్యవహారంపై ఎస్ఆర్ నగర్ పోలీసులు దృష్టిపెట్టారు. ప్రేమ పేరిట నాటకం ఆడి అమ్మాయిలను మోసగిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న దేవరాజ్‌ తీరుపై వివరాలు సేకరిస్తున్నారు. శ్రావణి కాకుండా ఇంకా ఎంతమంది అమ్మాయిలు దేవరాజ్‌ బారిన పడ్డారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు.

సాయిరెడ్డిని ప్రశ్నించనున్న పోలీసులు

సాయిరెడ్డిని ప్రశ్నించనున్న పోలీసులు

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సాయిరెడ్డిని శుక్రవారం విచారించే అవకాశం ఉంది. శ్రావణితో ఎలాంటి పరిచయం ఉంది. దేవరాజ్‌తో గొడవలు రావడానికి కారణాలు ఏమిటి? నిర్మాతతో శ్రావణికి ఉన్న పరిచయం ఎలాంటిది అనే కోణంలో పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందనే ఊహాగానాలు మీడియాలో వస్తున్నాయి.

Recommended Video

Arjuna Veta Movie Launch | Madhu Sai Vamshi | Sravani | Himabindhu || Filmibeat Telugu
దేవరాజ్‌పై ఆరోపణలు రుజువైతే

దేవరాజ్‌పై ఆరోపణలు రుజువైతే

శ్రావణి ప్రియుడు దేవరాజ్‌‌పై వస్తున్న ఆరోపణలపై ఆధారాలు దొరికితే అతడి మెడకు ఈ కేసులో ఉచ్చు బిగిసినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అమ్మాయిలను చీటింగ్, బ్లాక్ మెయిల్ చేసిన విషయాల్లో సాక్ష్యాలు దొరికితే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా సైబర్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘింనట్లయితే ఈ కేసులో మరింత తీవ్రతను దేవరాజ్ ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X