త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్‌ కామెంట్స్ వైరల్

ఇస్మార్ట్ హీరో రామ్ నటించిన RED సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. RED విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేసి రికార్డు కలెక్షన్లను కురిపిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సంక్రాంతి సినిమాలు అదిరిపోయే వసూళ్లను సాధిస్తున్నాయి. అందులో RED సినిమా షేర్, గ్రాస్ అన్ని సినిమాల కంటే ఎక్కువగా ఉంటోంది. ఈ మూవీ ఇంతటి ఘన విజయం సాధించినందుకు నిర్మాత స్రవంతి రవికిశోర్ మీడియాతో ముచ్చటించాడు.

Recommended Video

Red The Film Break Even In 4 Days | లాభం ఎంతంటే..?
కలెక్షన్ల లెక్కలు..

కలెక్షన్ల లెక్కలు..

RED సినిమా లెక్కలను నిర్మాత స్రవంతి రవి కిశోర్ ప్రకటించాడు. తొలి రోజు సినిమాకు రూ. 6.7 కోట్ల షేర్‌ వచ్చింది. రెండో రోజు రూ. 4.17 కోట్లు, మూడో రోజు రూ. 2.71 కోట్లు, నాలుగో రోజు రూ. 2.26 కోట్ల షేర్‌ వచ్చింది. కొన్నిచోట్ల రెండో రోజు, కొన్ని చోట్ల మూడో రోజే తిరిగి వచ్చేసింది. పశ్చిమ గోదావరిలో రెండో రోజుకే బ్రేక్‌ ఈవెన్‌ అయింది. తూర్పు గోదావరిలో మూడో రోజు బ్రేక్‌ ఈవెన్‌ అయింది. నాలుగు రోజుల్లో అందరికీ లాభాలు వచ్చాయని నిర్మాత చెప్పుకొచ్చాడు.

అందుకే ఆ ఆలోచన..

అందుకే ఆ ఆలోచన..

RED సినిమాను అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో చెప్పుకొచ్చాడు. హిందీ డబ్బింగ్ సినిమాల్లో 'నేను శైలజ' 300.. 'ఉన్నది ఒకటే జిందగీ' 190..'హలో గురు ప్రేమ కోసమే' 271.. 'హైపర్‌' 120.. 'గణేష్‌'కి 100.. 'ఇస్మార్ట్‌ శంకర్‌'150 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ ట్రాక్‌ రికార్డు కలిగిన ఏకైక దక్షిణాది హీరో రామ్‌. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రేక్షకుల కోసం థియేటర్లలోకి సినిమాను తీసుకువెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందని స్రవంతి రవికిశోర్ పేర్కొన్నాడు.

 ఆ కాంబోపై..

ఆ కాంబోపై..

మామూలుగా గత కొన్ని రోజులుగా రామ్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తుందన ప్రచారం జరుగుతుంది. అసలు ఈ కాంబోపై సినిమా వస్తుందా? అనే ప్రశ్నకు నిర్మాత సమాధానం ఇచ్చాడు. చూడాలి.. దేనికైనా టైమ్‌ రావాలి. త్రివిక్రమ్‌కి ఎన్నో కమిట్‌మెంట్స్‌ ఉండి ఉంటాయి. తను 'ఎస్‌. మనం సినిమా చేద్దాం' అంటే ఎప్పుడైనా నేను సిద్ధమే అంటూ స్రవంతి రవికిశోర్ ఓపెన్ అయ్యాడు.

రామ్ ప్యాన్ ఇండియా..

రామ్ ప్యాన్ ఇండియా..

ప్రస్తుతం మన హీరోలు ప్యాన్ ఇండియాపై కన్నేస్తున్నారు. అలాగే రామ్ కూడా ప్యాన్ ఇండియన్ మూవీ చేసే అవకాశాలపై స్రవంతి రవికిశోర్ స్పందించాడు. మంచి స్క్రిప్ట్ వచ్చి ఎగ్జైట్‌ అయితే తప్పకుండా చేస్తాడని అనుకుంటున్నాను. అయినా ఈ ప్రశ్న రామ్‌ను అడగటమే సబబు అంటూ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X