తమన్నాపై రామ్ నిర్మాత కంప్లైంట్

By Srikanya

తమన్నా తమ చిత్రానికి సరిగ్గా డేట్స్ కేటాయించలేదంటూ,ఇబ్బందిపెడుతోందని రామ్ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసారు. ఈ విషయం ఈ రోజే (శుక్రవారం)మీటింగ్ లో ప్రస్తావనకు వచ్చింది. తమన్నా మూడు చిత్రాల్లో బుక్ అయ్యి బిజీగా ఉండటంతో చాలా తమ సినిమాకు ఇబ్బంది అవుతోందని ఆ కంప్లైంట్ లో ఇచ్చారు. నిర్మాత కె.ఎల్ నారాయణ అధ్యక్ష్యతన జరిగిన ఈ మీటింగ్ లో ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ ను బట్టి ఆమెతో చేస్తున్న ముగ్గురు నిర్మాతలు ప్లాన్ చేసుకోవాలని తీర్మానం చేసారు. తమన్నా ప్రస్తుతం రచ్చ,ప్రభాస్ సినిమా రెబెల్ చేస్తోంది. అలాగే రామ్ తో ఎందుకంటే ప్రేమంటే చిత్రం కూడా చేస్తోంది. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎందుకంటే ప్రేమంటలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. 'కందిరీగ' తర్వాత హీరోగా రాం నటిస్తున్న సినిమా 'ఎందుకంటే.. ప్రేమంట!'. రాం సరసన తొలిసారిగా తమన్నా నటిస్తున్న ఈ సినిమాకి ఎ. కరుణాకరన్ డైరెక్టర్. 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' వంటి హిట్ సినిమాల తర్వాత కరుణాకరన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే.

ఈ సినిమాని రాం పెదనాన్న, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్ నిర్మిస్తున్నారు. కరుణాకరన్ మునుపటి రెండు సినిమాలకూ సంగీతాన్ని అందించిన జి.వి. ప్రకాశ్‌కుమార్ ఈ సినిమాకీ బాణీలు కూరుస్తున్నాడు. "నేను కరుణాకరన్‌కి ఫ్యాన్‌ని. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఫలానా వాళ్లతో సినిమా చేయాలనిపిస్తుంది. అలా ఎవరినైతే అనుకున్నానో వాళ్లంతా ఈ సినిమాలో పనిచేస్తున్నారు. తమన్నా చక్కని నటి. తనతో చేయడం హ్యాపీ" అని చెప్పాడు రాం. ఇక స్రవంతి మూవీస్‌లో ఎప్పటికైనా చేయాలన్న తన కోరిక 'ఎందుకంటే.. ప్రేమంట!'తో తీరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది తమన్నా.'దూకుడు' డైలాగ్ రైటర్ కోన వెంకట్ విలన్‌గా తొలిసారి కనిపించనుండటం ఈ సినిమాకి సంబంధించిన విశేషం.

సుమన్, రఘుబాబు, రిషి, సాయాజీ షిండే, నాగినీడు, సత్యకృష్ణన్, మేల్కోటే, సుమన్‌శెట్టి, జెమిని విజయ్ తారాగణమైన ఈ సినిమాకి మాటలు: కోన వెంకట్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, సంగీతం: జి.వి. ప్రకాశ్‌కుమార్, సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, స్టంట్స్: పీటర్ హెయిన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ. కరుణాకరన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X