Arjuna Phalguna Twitter Review: శ్రీవిష్ణు మూవీకి షాకింగ్ టాక్.. ఒక్కటే ప్లస్.. ఫైనల్ రిపోర్ట్ ఇదే
బ్యాగ్రౌండ్ లేకుండానే తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చి.. విలక్షణ నటనతో, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. సహజ సిద్ధమైన నటనతో ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చేశాడతను. ఈ క్రమంలోనే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.. ఇక, ప్రస్తుతం శ్రీవిష్ణు నటించిన చిత్రం 'అర్జున ఫల్గుణ'. పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

అర్జున ఫల్గుణ అంటున్న శ్రీవిష్ణు
విలక్షణ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రమే 'అర్జున ఫల్గుణ'. తేజ మర్ని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ దీనికి సంగీతం అందించాడు. ఈ చిత్రం డిసెంబర్ 31న విడుదలైంది.

బిజినెస్ కూడా భారీగా జరిగింది
శ్రీవిష్ణు నటించిన సినిమా అంటే సామాన్య ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంటుంది. కచ్చితంగా అతడు వైవిధ్యమైన కథనే ఎంపిక చేసుకుంటాడని, యాక్టింగ్‌తో అదరగొడతాడని అంతా అనుకుంటారు. అలాగే 'అర్జున ఫల్గుణ' విషయంలోనూ జరిగింది. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో దీనికి బిజినెస్ కూడా భారీగానే జరిగిందని తెలిసింది.

చివరి సినిమా... చాలా గ్రాండ్‌గా
శ్రీవిష్ణు సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. అలాగే, అందరు హీరోల అభిమానులు కూడా ఆదరిస్తుంటారు. పైగా ఈ ఏడాది విడుదల అవుతోన్న చివరి సినిమా కావడంతో 'అర్జున ఫల్గుణ' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఎక్కువ స్క్రీన్లలో దీన్ని రిలీజ్ చేస్తున్నారు.

‘అర్జున ఫల్గుణ’కు షాకింగ్ టాక్
ఎప్పటికే యూఎస్‌లోని అన్ని లొకేషన్లలో శ్రీవిష్ణు నటించిన 'అర్జున ఫల్గుణ' మూవీ విడులైంది. అంతేకాదు, అక్కడ షోలు కూడా పూర్తయ్యాయి. దీంతో సినిమాను చూసిన వారంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన ట్వీట్లను పరిశీలిస్తే.. ఈ సినిమాకు షాకింగ్‌గా నెగెటివ్ టాక్ వస్తోంది. చాలా మంది దీనికి ప్రతికూలంగా ట్వీట్లు చేస్తున్నారు.

ఫస్టాఫ్, సెకెండాఫ్ ఒకేలా అంటూ
ఇప్పటి వరకూ 'అర్జున ఫల్గుణ' మూవీని చూసిన ప్రేక్షకులు చెబుతున్న వివరాలు ప్రకారం.. శ్రీవిష్ణు నటించిన ఈ చిత్రం గంజాయి కేసులో చిక్కుకున్న స్నేహితుల కథతో సాగుతుందట. ఇక, ఈ మూవీ ఫస్టాఫ్‌తో పాటు సెకెండాఫ్ కూడా ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేదని వీక్షకులు అందరూ అభిప్రాయపడుతున్నారు. మూవీ అంతా ఫేలవమైన సన్నివేశాలతో చప్పగా సాగిందట.

ప్లస్ ఒక్కటే.. మైనస్‌లు చాలానే
'అర్జున ఫల్గుణ' ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే.. అన్నింటి కంటే ముందుగా శ్రీవిష్ణు ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు. సినిమా మొత్తాన్ని అతడే భుజాలపై వేసుకునే ప్రయత్నం చేశాడట. ఇక, తేజ మర్ని డైరెక్షన్, తీసుకున్న కథ, పసలేని సన్నివేశాలు, బలవంతమైన కామెడీ, నిర్మాణ విలువలు సహా ఎన్నో మైనస్‌లు ఉన్నాయని సినిమాను చూసిన వాళ్లు అంటున్నారు.
Recommended Video

ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే?
శ్రీవిష్ణు నటించిన మూవీ కావడంతో 'అర్జున ఫల్గుణ'పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఇక, ఈ సినిమా మాత్రం వాటిని అందుకోలేదని సినిమాను చూసిన వాళ్లు చెబుతున్నారు. ఫన్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో నడిచే సినిమానే అయినా.. ఎక్కడా ఆకట్టుకోలేకపోయిందని అంటున్నారు. కాకపోతే శ్రీవిష్ణు సినిమాలను మెచ్చే ప్రేక్షకులకు మాత్రం ఇది నచ్చుతుందట.


Click it and Unblock the Notifications











