Bhala Thandhanana ట్విట్టర్ రివ్యూ: శ్రీ విష్ణు మూవీకి అలాంటి టాక్.. రాజమౌళి చెప్పిందే జరుగుతుందా!
స్వయంకృషితోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత హీరోగా మారాడు శ్రీ విష్ణు. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ.. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేమైన శైలిని ఏర్పరచుకున్నాడు. సహజ సిద్ధమైన యాక్టింగ్‌తో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చుకుంటున్నాడు. అదే సమయంలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ యంగ్ హీరో 'భళా తందనాన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? దీనికి సంబంధించిన ట్విట్టర్ రివ్యూను చూద్దాం పదండి!

భళా తందనాన అంటూ వచ్చాడు
టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం 'భళా తందనాన' అనే సినిమాను చేశాడు. చైతన్య దంతులూరి అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో కేథరిన్ థ్రెస్సా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర బ్యానర్‌పై రజినీ కొర్రపాటి నిర్మించారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో గరుడ రామ్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు చేశారు.

అంచనాలు పెంచేసిన అప్‌డేట్లు
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన 'భళా తందనాన' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లే దీని నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

బిజినెస్ భారీగా... రిలీజ్ గ్రాండ్‌గా
శ్రీ విష్ణుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, 'భళా తందనాన'పై అంచనాలకు తగ్గట్లుగానే దీని హక్కులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. మంచి బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. అన్ని ఏరియాల్లో కలిపి ఈ మూవీని చాలా థియేటర్లలో తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.

భళా తందనానకు అలాంటి టాక్
శ్రీ విష్ణు - కేథరిన్ జంటగా నటించిన 'భళా తందనాన' మూవీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి మంచి టాక్ వచ్చింది. రాజమౌళి చెప్పినట్లుగానే ఈ సినిమా ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉందని అంటున్నారు.

ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ మరోలా
'భళా తందనాన' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లేందుకు కొంత టైమ్ తీసుకున్నారట. దీంతో కొంత స్లోగా సాగుతుందని తెలుస్తోంది. ఇక, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయేలా ఉందట. అయితే, సెకెండాఫ్ మాత్రం ఎంగేజింగ్‌గా ఉంటుందని తెలిసింది. మరీ ముఖ్యంగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే సీన్స్‌తో కట్టిపడేశారని చెబుతున్నారు.

సినిమా ప్లస్‌లు.. మైనస్‌లు ఇలా
శ్రీ విష్ణు 'భళా తందనాన' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో శ్రీ విష్ణు నటన, డైలాగ్స్, మేనరిజంతో మెప్పించాడట. అలాగే, మణి శర్మ బ్యాగ్రౌండ్ స్కోర్, ట్విస్టులు, యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అలాగే, నెమ్మదించిన స్క్రీన్‌ప్లే, కామెడీ పేలకపోవడం, పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా ఈ మూవీ ఎలా ఉందంటే!
ట్విట్టర్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. శ్రీ విష్ణు నటించిన 'భళా తందనాన' మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగే క్రైమ్ థ్రిల్లర్ అని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకూ ప్రేక్షకులను కట్టి పడేసే సన్నివేశాలతో సాగిపోతుందట. అయితే, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు నిరాశ పరిచినా.. టోటల్‌గా సినిమా మాత్రం బాగుందని వీక్షకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











