Raja Raja Chora Twitter Review: శ్రీవిష్ణు కెరీర్‌లో తొలిసారి.. ప్లస్ మైనస్ ఇవే.. మూవీ ఎలా ఉందంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇచ్చి.. విలక్షణ నటనతో, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. సహజ సిద్ధమైన నటనతో ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడతను. ఈ క్రమంలోనే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ప్రతి దానిలో అతడి నటనే హైలైట్‌గా ఉంటుందంటే.. ఈ యంగ్ హీరో యాక్టింగ్ టాలెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ప్రస్తుతం అతడు నటించిన చిత్రం 'రాజ రాజ చోర'. ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

‘రాజ రాజ చోర' అంటూ వచ్చిన విష్ణు

‘రాజ రాజ చోర' అంటూ వచ్చిన విష్ణు

ఈ ఏడాది ఆరంభంలోనే 'గాలి సంపత్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీవిష్ణు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు దారుణంగా బోల్తా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడతను నటించిన మూవీనే 'రాజ రాజ చోర'. నూతన దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటించింది. వివేక్ సాగర్ దీనికి సంగీతం అందించాడు. పుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

 అంచనాలు పెంచేసి.. బిజినెస్ భారీగా

అంచనాలు పెంచేసి.. బిజినెస్ భారీగా

శ్రీవిష్ణు నటించిన సినిమా అంటే సామాన్య ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంటుంది. కచ్చితంగా అతడు వైవిధ్యమైన కథనే ఎంపిక చేసుకుంటాడని, యాక్టింగ్‌తో అదరగొడతాడని అంతా అనుకుంటారు. అలాగే 'రాజ రాజ చోర' విషయంలోనూ జరిగింది. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో టీజర్, ట్రైలర్ వాటిని రెట్టింపు చేసేశాయి. దీంతో దీనికి భారీ ఓటీటీ డీల్స్ కూడా వచ్చాయి. కానీ, ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నారు. ఇక, ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

రెండు రాష్ట్రాల్లోనూ... అక్కడ ఎక్కువ

రెండు రాష్ట్రాల్లోనూ... అక్కడ ఎక్కువ

శ్రీవిష్ణు సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. అలాగే, అందరు హీరోల అభిమానులు కూడా ఆదరిస్తుంటారు. అందుకే 'రాజ రాజ చోర' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం నైజాంలో 400, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 200 థియేటర్లలో విడుదలవుతుందట. అలాగే, ఓవర్సీస్‌లో సైతం దాదాపు 100 వరకూ లొకేషన్లలో ఇది ప్రదర్శితం అవుతుందని తెలుస్తోంది. లాక్‌డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో ఇప్పటి వరకూ ఇదే అత్యధికం అన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

‘రాజ రాజ చోర'కు అలాంటి రెస్పాన్స్

‘రాజ రాజ చోర'కు అలాంటి రెస్పాన్స్

ఎప్పటికే యూఎస్‌లోని అన్ని లొకేషన్లలో శ్రీవిష్ణు నటించిన 'రాజ రాజ చోర' మూవీ విడులైంది. అంతేకాదు, అక్కడ షోలు కూడా పూర్తయ్యాయి. దీంతో సినిమాను చూసిన వారంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన ట్వీట్లను పరిశీలిస్తే.. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో పాజిటివ్ టాక్ వచ్చింది. చిత్రాన్ని వీక్షించిన వాళ్లంతా దీనిపై అద్భుతమైన రివ్యూలు ఇస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక, ఓవర్సీస్‌లోని ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

మొదటిది అలా... సెకాండాఫ్ మరోలా

మొదటిది అలా... సెకాండాఫ్ మరోలా

ఇప్పటి వరకూ 'రాజ రాజ చోర' మూవీని చూసిన ప్రేక్షకులు చెబుతున్న వివరాలు ప్రకారం.. శ్రీవిష్ణు నటించిన ఈ చిత్రం ఫస్టాఫ్ అదిరిపోయేలా ఉందట. ఔట్ అండ్ ఔట్ కామెడీతో మొదటి భాగం మొత్తం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే విధంగా ఉందని తెలుస్తోంది. ఇందులో శ్రీవిష్ణు తనదైన కామెడీతో అలరించాడని చెబుతున్నారు. ఇక, రెండో భాగం మాత్రం పూర్తి స్థాయిలో ఎమోషనల్‌గా సాగిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీవిష్ణు చెప్పినట్లు సినిమా మొదలైనప్పటి నుంచి నవ్వుతూ నవ్వుతూ చివరకు ఎమోషనల్ ఫీల్‌తో బయటకు వస్తారని టాక్.

సినిమాలో ప్లస్‌లు.. మైనస్‌లను ఇవే

సినిమాలో ప్లస్‌లు.. మైనస్‌లను ఇవే

'రాజ రాజ చోర' ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే.. అన్నింటి కంటే ముందుగా శ్రీవిష్ణు ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు. కామెడీకి కామెడీ, ఎమోషన్స్‌కు ఎమోషన్స్ పండిస్తూ అతడు చేసిన యాక్టింగ్ ఔరా అనిపిస్తుందట. అలాగే, మొదటి చిత్రమే అయినా హసిత్ గోలి దీన్ని అద్భుతంగా తెరకెక్కించాడని వీక్షకులు చెబుతున్నారు. అలాగే, వివేక్ సాగర్ మ్యూజిక్, ఎడిటింగ్ ఈ చిత్రానికి మరింత ప్లస్ అయ్యాయట. శ్రీవిష్ణుతో పాటు రవిబాబు, సునైనా, మేఘా నటనలు ఆకట్టుకున్నాయట. అయితే, కొన్ని సీన్స్ మాత్రం రొటీన్‌గా ఉండడం దీనికి మైనస్ అని అంటున్నారు.

Recommended Video

Raja Raja Chora Movie Trailer | Filmibeat Telugu
 ‘రాజ రాజ చోర' సినిమా ఎలా ఉందంటే?

‘రాజ రాజ చోర' సినిమా ఎలా ఉందంటే?

టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో శ్రీవిష్ణు చెప్పిన విషయాలతో 'రాజ రాజ చోర' మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఇక, ఈ సినిమా వాటిని అందుకుందన్న టాక్ వినిపిస్తోంది. సినిమాను చూసిన వారంతా దీనికి పాజిటివ్‌ రివ్యూలు ఇస్తున్నారు. ఫన్ అండ్ ఎమోషన్స్‌తో సాగే ఈ చిత్రం అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇందులో పెద్దగా మైనస్‌లు లేకపోవడం కలిసొచ్చే అంశమని అభిప్రాయపడుతున్నారు. ఫైనల్‌గా 'రాజ రాజ చోర' ఫ్యామిలీ మొత్తంతో కలిసి చూసే సినిమా అని సినిమాను చూసిన వాళ్లంతా చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X