Don't Miss!
- News అక్కడ వైసీపీని ఢీ కొట్టేదెవరు?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
నివేదా పొట్టిదే.. కానీ గట్టిది.. చంద్రముఖిలో రజనిలా కిటికీలోంచి.. శ్రీవిష్ణు సెటైర్లు
మెంటల్ మదిలో ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్వకత్వంలో శ్రీ విష్ణు, నివేదా థామస్, నివేదా పేతురాజ్, సత్యదేవ్ కలిసి నటించిన చిత్రం బ్రోచేవారెవరురా. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు హీరోలు రామ్, నారా రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ నివేదా థామస్‌పై సెటైర్లు వేశారు. ఆయన ఏమన్నారంటే..
బ్రోచేవారెవరురా కథ గురించి
బ్రోచేవారెవరురా సినిమా కథను దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పగానే నాకు బాగా నచ్చేసింది. ఈ సినిమాలో మిత్రా అనే క్యారెక్టర్ నచ్చి బ్రోచేవారెవరురా మూవీలో నటించడానికి ఒప్పుకొన్నాను. డ్యాన్స్ నేపథ్యంగా మిత్రా కార్యెక్టర్ ఉంటుంది. ఎవరు చేస్తారనే ఆసక్తి ఉండేది. తీరా నివేదా థామస్ ఎంపిక చేసిన తర్వాత ఒకే అనుకొన్నాను. డ్యాన్స్ ఎలా చేస్తుందని తెలుసుకొంటే.. 20 రోజుల్లో నేర్చేసుకుందని చెప్పారు.
నివేదా థామస్‌పై సెటైర్లు
నివేదా థామస్ చూస్తే పొట్టిది. భూమికి ఇంతే ఉంటుంది. ఎలా చేస్తుందని చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చూసినట్టు వెళ్లి చూశా. అప్పుడు పొట్టిది గట్టిది అనిపించింది. నాకు నేర్చించమంటే నీవు మాట్లాడుతుంటే డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది. మీకు అక్కర్లేదని సెటైర్ వేశారు.
ప్రతీ అమ్మాయి కోసం సినిమా చేశా
మిత్రా పాత్రలో నివేదా థామస్ చాలా బాగా చేసింది. అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటుంది. మిత్రా పాత్రను ఇష్టపడి చేశాను. ప్రతీ అమ్మాయి కోసం ఈ సినిమా చేశాను. అలాగని ఎడుపుకొట్టు సినిమా కాదు. చాలా ఫన్‌గా ఉంటుంది. ఇక సత్యదేవ్ కూడా బాగా నటించాడు. సత్యదేవ్, నివేదా పేతురాజ్‌తో కలిసి ఇంతకు ముందు నటించాను. వారి గురించి ముందే తెలిసు వాళ్లు ఎంత బాగా నటిస్తారో అని అన్నారు.
వెంకటేష్ అభిమానిగా నటించా
గతంలో చిన్న సినిమాలకు ఇబ్బంది ఉండేది. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ ఉండటంతో చిన్న సినిమాలకు మంచి రోజులు వచ్చాయి. నా సినిమాలన్నీ సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ చేయడం వెరీ హ్యాపీ. ఇక ఈ సినిమాలో నేను వెంకటేష్ ఫ్యాన్‌గా నటిస్తున్నాను. నాకు ఎక్కువగా అభిమానించేది వెంకటేష్‌నే. అలాంటి వ్యక్తి అభిమానిగా నటించడం ఆనందంగా ఉంది.