twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఇద్దరు రచయితలపైనే యుద్దమా? "నీదీ నాదీ ఒకే కథ" పోస్టర్ వివాదం కానుందా??

    |

    Recommended Video

    ఆ ఇద్దరు రచయితలపైనే యుద్దమా?

    శ్రీవిష్ణు, సత్నా టిటుస్‌ ప్రధాన పాత్రధారులుగా వేణు ఉడుగులను దర్శకుడిగా పరిచయం చేస్తూ అరాన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై కృష్ణవిజయ్, ప్రశాంతి లు నిర్మిస్తున్న చిత్రం నీదీ నాదీ ఒకేకథ. ఈ సినిమాకి కథ కూడా దర్శకుడు వేణూ అందించినదే, అయితే ఈరోజు ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదలవ్వగా ఈ క్రేజీ కాంబినేషన్ పై సోషల్ మీడియా లో నీదీనాదీ ఒకే కథ, NNk అంటూ హ్యాష్ టాగ్‌తో పోస్ట్‌లు కనిపించటం గమనార్హం.

    నీది నాదీ ఒకే క‌థ‌

    నీది నాదీ ఒకే క‌థ‌

    నిజానికి ఈ సినిమా కొంతకాలంగా వార్తల్లో ఉంటూ వస్తోంది నిర్మాతకు బ‌డ్జెట్ భారం అన్న‌ది లేకుండా, కేవ‌లం క‌థ‌, క‌థ‌నంతో పాటు ఓ కొత్త టెక్నాల‌జీతో ప్రస్తుత స‌మాజ రీతుల‌కు అద్దం ప‌డుతూ రూపుదిద్దుకున్న సినిమా అన్న టాక్ ఈ నీది నాదీ ఒకే క‌థ‌కి కొంత హైప్ తెచ్చింది.

    టాలీవుడ్‌‌లో తొలి ప్ర‌య‌త్నం

    టాలీవుడ్‌‌లో తొలి ప్ర‌య‌త్నం

    వాస్త‌వానికి డెన్మార్క్‌లో రూపుదిద్దుకున్న డాగ్మీ 95 మెథ‌డాల‌జీని ఇక్క‌డి వాతావర‌ణానికి అనుగుణంగా కొద్ది పాటి మార్పులు చేసి , అక్క‌డి మేనిఫెస్టోలో ఉన్న ప‌ది సూత్రాల‌లో ఏడింటిని మాత్ర‌మే అనువ‌ర్తింప‌జేసి, రూపొందించిన రెండో భార‌తీయ సినిమా ఇది. ఇక టాలీవుడ్‌కు మాత్రం పూర్తిగా ఇది తొలి ప్ర‌య‌త్నం.

     పర్సనాలిటీ డెవలప్మెంట్

    పర్సనాలిటీ డెవలప్మెంట్

    ఈ సంగతులు పక్కన పెడితే తానేం చెప్పాలనుకుంటున్నాడో ఈ మోషన్ పోస్టర్లోనే స్పష్టం చేయాలనుకుంటున్నట్టున్నాడు దర్శకుడు. ప్రస్తుత విధ్యా విధానం మీదా, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ ఒక వ్యర్థ ప్రయత్నం అని చెప్పాలన్నదే ఒక ఉద్దెశ్యమేమో అనిపించేలా ఉంది.

     తగలబడుతున్న పుస్తకాలు

    తగలబడుతున్న పుస్తకాలు

    హీరో శ్రీవిష్ణు ఒక చోట గాయాలతో, పూర్తి డిప్రెసివ్ లుక్లో కనిపిస్తూనే మొహంలో ఒక అసహనం కనిపిస్తూ, సిగరెట్‌తో యాంగ్రీ అట్టిట్యూడ్ తో కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ మాత్రం ఆ పోస్టర్లో తగలబడుతున్నట్టు కనిపిస్తున్న పుస్తకాలమీదే.

    యండమూరి వీరేంద్రనాథ్

    యండమూరి వీరేంద్రనాథ్

    వ్యక్తిత్వ వికాసం పై వచ్చిన యండమూరి వీరేంద్రనాథ్, బీవీ పట్టాభీ రామ్‌లు రాసిన పుస్తకాల టైటిల్స్ కి దగ్గరగా ఉండటం, అవీ ఏవో అనామక పుస్తకాలు కాదు.. ఆయా రచయితలు రాసిన బెస్ట్ సెల్లర్స్ కావటం గమనార్హం... మొత్తానికి సినిమా లో తాను చెప్పదల్చుకున్న అంశానికీ ఈ ఇద్దరు రచయితలకీ సంబంధం ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయికూచుంది...

     సమాధానాలు సినిమాలోనే?

    సమాధానాలు సినిమాలోనే?

    ఇప్పటికే ఈ విషయం మీద సోషల్ మీడియాలో చిన్న సైజు చర్చమొదలయ్యింది. మరి వీటన్నిటికీ సమాధానాలు దర్శకుడు వేణూ ఊడుగుల సినిమాలోనే ఇస్తాడా లేక తానే స్వయంగా చెబుతాడా అన్నది చూడాలి..???

    English summary
    Actor Sree Vishnu, who is enjoying the success of ‘Metal Madhilo’, is once again gearing up to enthrall the audience with his next ‘Needi Naadi Oke Katha’. The makers of the movie unveiled the first look motion teaser on Friday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X