Don't Miss!
- News అక్కడ వైసీపీని ఢీ కొట్టేదెవరు?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
ఈ సినిమా అర్థం కాక ప్రేక్షకులకు పిచ్చెక్కడం ఖాయం : శ్రీవిష్ణు
Recommended Video
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రీయ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'వీర భోగ వసంత రాయలు' ఆర్ ఇంద్రసేన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాబా క్రియేషన్స్ బేనర్లో అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఈ చిత్ర నటుల్లో ఒకరైన శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చాలా అరుదైన సినిమా
‘అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాకు పని చేసిన టీం ఈచిత్రానికి చేస్తోంది. ‘అప్పట్లో ఒకడుండేవాడు' వంద సినిమాల్లో వచ్చే ఒక సినిమా కాదు... వెయ్యి సినిమాల్లో వచ్చే ఒక సినిమా. అదే విధంగా ‘వీర భోగ వసంత రాయలు' లాంటి సినిమా మళ్లీ రావాలంటే అది ఈ దర్శకుడు ఇంద్రసేన తీస్తేనే సాధ్యమవుతుంది.
పిచ్చెక్కిపోవడం ఖాయం
నాకు ఈ సినిమా కథ చెప్పిన తర్వాత సినిమా పోస్టర్లో ఉన్నట్లు నా పరిస్థితి రెండ్రోజులు తలక్రిందులైంది. సినిమా చూసేపుడు ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతారు. మొదట సినిమా అర్థం అవ్వదు. డౌట్ లేకుండా చెబుతున్నాను ఇది పిచ్చెక్కిపోయే సినిమా అని శ్రీవిష్ణు వ్యాఖ్యానించారు.
చాలా టార్చర్ పెట్టాడు
ఈ సినిమాలో నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీయ ఇలా చాలా మంది స్టార్లు ఉన్నారు. కానీ ఈ సినిమాకు హీరో స్క్రీన్ ప్లే అయితే.. హరోయిన్ స్టోరీ. డైరెక్టర్ ఇంద్ర చాలా మంచోడే కానీ ఈ సినిమాకు చాలా కష్టపెట్టాడు. సినిమాల్లోకి వచ్చి ఇన్నాళ్లు పడిన కష్టం కంటే ఎక్కువ కష్టం ఈ ఒక్క సినిమాకే పెట్టాడు. ఒకరకంగా చెప్పాలంటే టార్చర్ పెట్టాడు. అయితే సినిమా చూసుకున్న తర్వాత చాలా సంతోషం అనిపించింది. టీజర్, ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా ఏంటనేది మీకు అర్థమవుతుందని శ్రీవిష్ణు తెలిపారు.
తెలుగు ఇలాంటి మూవీ రాలేదు
నారా రోహిత్ మాట్లాడుతూ... ఈ సినిమాలో హీరో అని ఎవరూ లేరు. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ హీరోనే. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం, తెలుగులో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదని కచ్చితంగా చెప్పగలను అన్నారు.