క్రేజీగా మెగా డాటర్ శ్రీజ శ్రీమంతం: చెర్రీ, ఉపాసన, బన్నీ, నిహారిక సందడి (ఫోటోస్)
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కొన్ని రోజుల క్రితమే ట్వీట్ చేశారు. 'శ్రీజ కళ్యాణ్ బేబీ 2 లోడింగ్' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఈ శుభవార్తను అభిమానులకు వెల్లడించారు.
తాజాగా కొణిదెల కుటుంబం శ్రీజకు గ్రాండ్‌గా శ్రీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన వ్యవహారాలన్నీ రామ్ చరణ్ భార్య ఉపాసన దగ్గరుండి చూసుకున్నారు. రోటీన్‌గా తెలుగు స్టైల్‌లో శ్రీమంతంలా కాకుండా ఫారిన్ స్టైల్‌లో 'బేబీ షవర్' పార్టీ నిర్వహించారు.

శ్రీజ-కళ్యాణ్ దంపతులు
బేబీ షవర్ పార్టీలో శ్రీజ-కళ్యాణ్ దంపతులు. శ్రీజ, కళ్యాణ్ వివాహం 2016, మార్చి 28న జరిగింది. దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.

శ్రీజ రెండో వివాహం
గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ... ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతడితో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కళ్యాణ్‌ను రెండో వివాహం చేసుకున్నారు.

శ్రీజను ఆశీర్వదించిన రామ్ చరణ్-ఉపాసన దంపతులు
రామ్ చరణ్-ఉపాసన దంపతులు శ్రీజను ఆశీర్వదించారు. ఈ బేబీ షవర్ పార్టీకి హోస్ట్ చేసింది మరెవరో కాదు... మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన. ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఈ పార్టీని డిజైన్ చేశారట.

మ్యూజిక్ బ్యాండ్
ఈ బేబీ షవర్ పార్టీకి కేవలం మెగా ఫ్యామిలీకి సంబంధించిన సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా వెస్టర్న్ సంగీత కచేరి సైతం ఏర్పాటు చేశారు.

నిహారిక
శ్రీజ బేబీ షవర్ పార్టీలో నిహారిక. మ్యూజిక్ బ్యాండ్ సభ్యులతో కలిసి ఫోటోలకు ఫోజు ఇచ్చిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

బేబీ షవర్ పార్టీలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి
బేబీ షవర్ పార్టీలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో అతి కొద్ది మంది మెగా ఫ్యామిలీ సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది.
పార్టీ వీడియో వైరల్
శ్రీజ బేబీ షవర్ పార్టీకి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మెగా అభిమానులు లైక్స్, షేర్లతో దీన్ని వైరల్ చేయడంతో పాటు... శ్రీజను విష్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
బేబీ 2 లోడింగ్ అంటూ...
కళ్యాణ్ దేవ్ తాను తండ్రి కాబోతున్న విషయాన్ని వెల్లడిస్తూ చేసిన ఫేస్ బుక్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. 'శ్రీజ కళ్యాణ్ బేబీ 2 లోడింగ్' అంటూ తన ఎగ్జైట్మెంట్‌ను అభిమానులతో పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











