వెంకటేష్ తో సీనియర్ హీరో మల్టీస్టారర్.. మరోసారి క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పైకి వస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా అగ్ర హీరోలు ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవాడానికి ఏ మాత్రం ఇబ్బంది పడటం లేదు. ఇక మొదటి నుంచి కూడా మల్టీస్టారర్ సినిమాలకు సపోర్ట్ చేస్తున్న నెంబర్ సౌత్ హీరో విక్టరీ వెంకటేష్ అని చెప్పవచ్చు. కథ నచ్చితే పాత్రలో హెచ్చు తగ్గులు చూడకుండా ఓకే చెప్పేస్తుంటారు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే వెంకటేష్ లిస్టులో మరిన్ని మల్టీస్టారర్ కథలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన అన్నయ్య కొడుకు రానాతో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కానీ సరైన స్క్రిప్ట్ తగలడం లేదు. ఇక కమల్ హాసన్ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాడట. గతంలోనే వీరి కలయికలో ఈనాడు అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అనంతరం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలోనే మరో సినిమా చేయాలని అనుకున్నారు. ఇక ఇటీవల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆ ప్రాజెక్ట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Sreekanth addala comments on venkatesh another multi starrer

నిజంగా వారితో కలిసి సినిమా చేయాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ మొత్తం పూర్తిగా సెట్టవ్వలేదు. ప్లానింగ్ సెట్టవ్వాలి, అలాగే స్టార్స్ కూడా అందుబాటులో ఉండాలి. ఒకసారి ఫుల్ స్క్రిప్ట్ సిద్ధమైతే ఆ మల్టీస్టారర్ తప్పకుండా ఉంటుందని శ్రీకాంత్ అడ్డాల వివరణ ఇచ్చారు. వెంకటేష్ తో నారప్ప సినిమాను రీమేక్ చేసిన శ్రీకాంత్ అడ్డాల పరవాలేదు అనిపించాడు. కర్ణన్ రీమేక్ కూడా ఆఫర్ వచ్చినట్లు క్లారిటీ అయితే ఇచ్చాడు. కానీ సినిమా ప్లాన్ సెట్టవ్వలేదని అన్నాడు. అలాగే అన్నాయ్ అనే మరొక ప్రాజెక్ట్ కూడా అనుకుంటున్నట్లు చెబుతూ గీత ఆర్ట్స్ లో ఒక స్టార్ హీరోతో ఆ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు శ్రీకాంత్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X