శ్రీకారం ట్విట్టర్ రివ్యూ: వాళ్లిద్దరే సినిమాను నిలబెట్టారు.. ఆ అంశాలే నిరాశ పరిచాయి.. ఎలా ఉందంటే!

టాలీవుడ్‌లో సందేశాత్మక చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణే లభిస్తుంటుంది. అందుకే కమర్షియల్ పంథాను పక్కన పెట్టి ఒక్కోసారి బడా హీరోలు సైతం ఆ తరహా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ చేస్తున్న చిత్రమే 'శ్రీకారం'. భారతదేశంలో అతిపెద్ద రంగమైన వ్యవసాయం చేయాల్సిన అవసరం గురించి చెబుతూ తీసిందే ఈ సినిమా. ఈ మూవీ మహా శివరాత్రి సందర్భంగా గురువారం విడుదలవుతుంది. అయితే, ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా అభిప్రాయం చెబుతున్నారు. అసలు ఈ మూవీ ఎలా ఉందంటే?

అలా ‘శ్రీకారం’ చుట్టిన శర్వానంద్

అలా ‘శ్రీకారం’ చుట్టిన శర్వానంద్


కిశోర్ రెడ్డి అనే నూతన దర్శకుడితో శర్వానంద్ చేస్తున్న చిత్రమే 'శ్రీకారం'. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట దీన్ని నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

దాన్నే హైలైట్ చేస్తూ తీసిన చిత్రం

దాన్నే హైలైట్ చేస్తూ తీసిన చిత్రం

గతంలో కిశోర్ రెడ్డి 'శ్రీకారం' అనే షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించాడు. వ్యవసాయం ఆధారంగా తీసిన దీనికి ప్రశంసలు దక్కాయి. అదే సమయంలో ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇప్పుడదే దర్శకుడు శర్వానంద్‌తో కలిసి ఆ టైటిల్‌తోనే సినిమాను రూపొందించాడు. వ్యవసాయం చేసే వాడే లేకపోతే అన్న తినేదెలా అనే కాన్సెప్టుతో ఈ సినిమాను రూపొందించారన్న విషయం తెలిసిందే.

అంచనాలకు తగ్గట్లుగానే బిజినెస్

అంచనాలకు తగ్గట్లుగానే బిజినెస్

టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత 'శ్రీకారం' మూవీపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. దీంతో శర్వానంద్ కెరీర్‌లోనే తొలిసారి ఈ మూవీకి బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 5.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.40 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటితో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ బిజినెస్ మొత్తంగా రూ. 17.10 జరిగినట్లు తెలుస్తోంది.

భారీగా రిలీజ్.. అక్కడ షోలు స్టార్ట్

భారీగా రిలీజ్.. అక్కడ షోలు స్టార్ట్

మహా శివరాత్రి సందర్భంగా తెలుగులో మూడు సినిమాలు, ఓ కన్నడ డబ్బింగ్ చిత్ర విడుదల అవుతున్నాయి. అన్నింటి కంటే 'శ్రీకారం'కే ఎక్కువ థియేటర్లు వచ్చాయి. ఈ సినిమా దాదాపు 800లకు పైగా థియేటర్లలో విడుదల అవుతోంది. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం హవా చూపిస్తోంది. ఇక, అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి.

ట్విట్టర్ ద్వారా రివ్యూలు.. ఎలా ఉంది?

ట్విట్టర్ ద్వారా రివ్యూలు.. ఎలా ఉంది?


యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు కంప్లీట్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో 'శ్రీకారం' సినిమాను చూసిన వారంతా ట్విట్టర్ ద్వారా రివ్యూలు ఇస్తున్నారు. ఇక, ఈ సినిమాకు మొత్తంగా పాజిటివ్‌ టాక్ వచ్చింది. వ్యవసాయంపై ఈ చిత్ర యూనిట్ ఇచ్చిన మెసేజ్ బాగుందని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా నెమ్మదిగా సాగే ఎమోషనల్ డ్రామా అని ప్రేక్షకులు చెబుతున్నారు.

వాళ్లిద్దరే సినిమాను నిలబెట్టారు

వాళ్లిద్దరే సినిమాను నిలబెట్టారు

'శ్రీకారం' సినిమాను శర్వానంద్ వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడని అంటున్నారు. అలాగే, అతడికి సమానమైన పాత్రలో రావు రమేష్ అద్భుతంగా నటించాడని చెబుతున్నారు. ప్రియాంక తన అందంతో ఆకట్టుకుందట. దర్శకుడు కూడా తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పే ప్రయత్నం చేశాడట. మొత్తం ఫాదర్ సెంటిమెంట్, వ్యవసాయంపై మెసేజ్ సూపర్‌ కన్నీరు తెప్పిస్తుందట.

మొత్తంగా ప్లస్ మైనస్‌లు ఇవే

మొత్తంగా ప్లస్ మైనస్‌లు ఇవే


'శ్రీకారం'లో ఏఏ అంశాలు మెప్పించాయి? ఏ అంశాలు నిరాశ పరిచాయి? అనేది పరిశీలిస్తే.. శర్వానంద్, రావు రమేష్ యాక్టింగ్, ద్వితియార్ధం, ఎమోషన్స్, వ్యవసాయంపై వచ్చే సీన్స్, క్లైమాక్స్ మెసేజ్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. అలాగే, ఎడిటింగ్, మ్యూజిక్, స్లో నేరేషన్, ఫస్టాఫ్ నిరాశ పరిచినట్లు సినిమాను చూసిన వాళ్లంతా అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X