twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా బాయ్ ఫ్రెండ్ చూస్తే ఫీల్ అవుతాడు.. ప్రేమలో ఉన్నానంటూ అసలు గుట్టు విప్పిన శ్రీముఖి

    |

    బుల్లితెరపై శ్రీముఖి చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఎంతగా ఎంటర్టైన్ చేస్తూ నవ్వులు పంచుతున్నా కూడా ఆమె జీవితంలోనూ విషాదగాథలున్నాయి. బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో శ్రీముఖి తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. తన ప్రేమ, బ్రేకప్, మోసపోవడం వంటి విషయాలన్ని కూడా చెప్పేసింది. కానీ అతని పేరు ఏంటన్నది మాత్రం ఎక్కడా కూడా బయటపెట్టలేదు.

     పెళ్లిపై అలా..

    పెళ్లిపై అలా..

    ఆ మధ్య శ్రీముఖి తన పెళ్లి గురించి కామెంట్ చేసింది. సుమ క్యాష్ షోలో భాగంగా శ్రీముఖి స్పెషల్ గెస్ట్‌గా వచ్చింది. ఆ సమయంలో శ్రీముఖి తన పెళ్లి గురించి మాట్లాడింది. తనకు ఇంకో రెండు మూడేళ్లలో పెళ్లి అవుతుందని, అప్పుడు ఇండస్ట్రీకి దూరంగానే ఉంటానని బయటపెట్టేసింది.

     ఢీ కంటెస్టెంట్‌పై అలా.

    ఢీ కంటెస్టెంట్‌పై అలా.

    ఢీ కంటెస్టెంట్ పండుపైనా శ్రీముఖి కామెంట్ చేసింది. ఆడ వేషం వేసుకోకుండా ఉంటే నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని అంటూ అదే షోలో కామెంట్ చేసింది. అయితే అది కామెడీగా అన్నా ఆ కామెంట్లు మాత్రం తెగ వైరల్ అయ్యాయి.

     ఇప్పుడు ఇలా..

    ఇప్పుడు ఇలా..

    మళ్లీ శ్రీముఖి తన ప్రేమ వ్యవహారం గురించి కామెంట్ చేసింది. శ్రీముఖి తాజా సుమ స్టార్ట్ మ్యూజిక్ షోలో గెస్ట్‌గా పాల్గొంది. వచ్చే ఆదివారం ప్రసారం కాబోతోన్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో శ్రీముఖి తన ప్రేమ గురించి బయటపెట్టేసింది.

    అలాంటి ప్రశ్న..

    అలాంటి ప్రశ్న..

    స్టార్ట్ మ్యూజిక్ షోలో భాగంగా శ్రీముఖిని సుమ ఓ ప్రశ్న అడిగింది. అక్కడ కనిపిస్తున్నవారిలో ఏ హీరో అంటే ఇష్టమంటూ శ్రీముఖిని ఇరికించే ప్రయత్నం చేసింది సుమ. నాకు చిరంజీవి అంటేనే ఇష్టమంటూ బయటపెట్టేసింది శ్రీముఖి.

    నాకంటూ కొన్ని..

    నాకంటూ కొన్ని..

    ఎవరితో డేటింగ్‌కు వెళ్తావని శ్రీముఖిని మరో ప్రశ్న అడిగింది సుమ. అయితే ఆమె ప్రోమో కోసం అలా చెప్పిందో ఏమో గానీ శ్రీముఖి చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ కమిటెడ్.. ఇప్పుడు నేను ఇలా డేటింగ్‌కు వెళ్తే ఆయన ఫీలవుతాడు. నా కంటూ కొన్ని నియమాలున్నాయ్ అంటూ శ్రీముఖి బాంబ్ పేల్చింది. అయితే ఈ వ్యాఖ్యలు కామెడీగా చేసిందా? లేదా నిజంగానే అందా? అన్నది తెలియాలంటే ఈ షో చూడాల్సిందే.

    English summary
    Sreemukhi About Her Love And Marriage In Suma Show,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X