కారులోనే కానిచ్చేస్తున్నారు.. రాత్రి పూట శ్రీముఖి అవినాష్ రచ్చ
బిగ్ బాస్ సభ్యులైన శ్రీముఖి, అవినాష్‌లు సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. మూడో సీజన్‌లో సభ్యురాలైన శ్రీముఖి.. సోషల్ మీడియా దక్కించుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అవినాష్ బిగ్ బాస్ షోలోకి రాకముందు నుంచి శ్రీముఖితో స్నేహంగానే ఉంటూ వచ్చాడు. శ్రీముఖి హోస్ట్‌గా వచ్చిన ఉమెనియా షోలనూ అవినాస్ రచ్చ చేశాడు.

ఉమెనియా షోతో..
శ్రీముఖి ఆ మధ్య తన యూట్యూబ్ చానెల్‌లో ఉమెనియా అనే షోను చేసింది. ఇందులో లేడీ సెలెబ్రిటీలను తీసుకొచ్చి ముచ్చట్లు పెట్టింది. పునర్నవి, విష్ణుప్రియలతో చేసిన ఎపిసోడ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఆ షోలో అవినాష్ కూడా శ్రీముఖితో కలిసి హల్చల్ చేశాడు.

మంచి స్నేహితులుగా..
అయితే అవినాష్ శ్రీముఖిలు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ ఇంట్లో అవినాష్ ఉన్న సమయంలో శ్రీముఖి మద్దతు తెలిపింది. తన వంతు సహకారంగా తన అభిమానులను అవినాష్, అరియానా వంటి వారికి ఓట్లు వేయమని కోరింది.

బయటకు వచ్చాక..
బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక అవినాష్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శ్రీముఖి, తన గ్యాంగ్‌తో కలిసి బిగ్ బాస్ ఎంటర్టైనర్ అంటూ సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చింది. మొత్తానికి ఇక అందరూ కలిసి గోవాలో చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు.

గోవాలో రచ్చ..
శ్రీముఖి, విష్ణుప్రియ, అరియానా, అవినాష్, ఆర్జే చైతూ ఇలా అందరూ కలిసి గోవాలో సందడి చేశారు. శ్రీముఖి, విష్ణుప్రియ అందాల ఆరబోత సెగలు పుట్టించాయి. తాజాగా షూటింగ్ అనంతరం శ్రీముఖి, అవినాష్ కారులో రచ్చ చేశారు.

మ్యాగీ తింటూ..
షూటింగ్ అయిపోయింది వెళ్తున్నాను.. మొదటి సారి ఇలా రోడ్డు మీద చేసిన మ్యాగిని తింటున్నాను.. అంటూ శ్రీముఖి తన కారులో ఉన్న అవినాష్‌ను చూపించింది. ఇక కారులో మ్యాగీ తింటూ శ్రీముఖి రచ్చ రచ్చ చేసింది. జాతి రత్నాలు సినిమాల్లోని మ్యానరిజంతో శ్రీముఖి, అవినాష్ రచ్చ చేశారు.


Click it and Unblock the Notifications











