శ్రీముఖిపై విజయశాంతి కామెంట్.. యాంకర్ భావోద్వేగం.. రియాక్షన్ ఎలా ఉందంటే!
పటాస్ షో ద్వారా బాగా ఫేమస్ అయిన శ్రీముఖి ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా తన పాపులారిటీని రెట్టింపు చేసుకుంది. అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచి అందరినీ ఆకట్టుకుంది. 100 రోజుల పాటు 'బిగ్ బాస్ 3' వేదికపై తన అల్లరితో మాయ చేసింది ఈ బుల్లితెర బ్యూటీ. కాగా తాజాగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఆమెను ఓ నిక్‌నేమ్ తో పిలవడంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఆ వివరాలేంటో చూద్దామా..

సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో విజయశాంతి కీలక పాత్ర పోషించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మేరకు ఘనంగా సక్సెస్ సెలెబ్రేషన్స్ చేశారు మేకర్స్. ఈ సక్సెస్‌మీట్‌కు యాంకర్‌గా వ్యవహరించింది శ్రీ ముఖి.

శ్రీముఖిపై విజయశాంతి కామెంట్.. బహుశా అందుకేనేమో
ఈ సక్సెస్ మీట్‌లో విజయశాంతి యాంకర్ శ్రీముఖిని ‘చిన్న రాములమ్మ' అనేసింది. నిజానికి వెండితెర రాములమ్మగా విజయశాంతి పేరుండగా, బుల్లితెర రాములమ్మ అని శ్రీముఖిని అంటుంటారు. శ్రీముఖి చేసిన రాములమ్మ డాన్స్ ద్వారా ఆమెకు ఈ పేరొచ్చింది. బహుశా ఈ కోణంలోనే విజయశాంతి యాంకర్ శ్రీముఖిని ఇలా ‘చిన్న రాములమ్మ' అని ఉండవచ్చు.

శ్రీముఖి ఫీలింగ్స్..
విజయశాంతి ఇలా అందంతో ఉబ్బితబ్బిబై పోతోంది శ్రీముఖి. ‘సరిలేరు నీకెవ్వరు' ''సక్సెస్‌మీట్ స్టేజీపై లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి నన్ను ‘చిన్న రాములమ్మ' అని పిలిచారు. ఆ పిలుపు విని నా ఆనందానికి అవధుల్లేవు. నోట్లో నుంచి మాట రాలేదు. ఈ విషయాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను'' అని శ్రీముఖి పేర్కొంది.

గతేడాది చిరు.. ఇప్పుడు విజయశాంతి
గతేడాది శ్రీముఖి బిగ్‌బాస్ 3 రన్నర్‌గా నిలిచి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ట్రోఫీ అందుకుంది. ఇప్పుడేమో విజయశాంతితో ఇలా పిలిపించుకుంది. దీంతో ఆనందంగా ఉన్న ఆమె సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోను అభిమానులతో పంచుకుంది . ఇది చూసి శ్రీముఖి నిక్‌నేమ్ అదిరింది అంటున్నారు.

చెప్పలేనంత సంతోషంగా ఉంది
''2019 సంవత్సరంలో వృత్తిపరంగా మెగాస్టార్ చిరంజీవి గారు నా జీవితంలో గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఇచ్చారు. అలాగే 2020 ఆరంభంలో విజయశాంతిని కలవడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది'' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది శ్రీముఖి.


Click it and Unblock the Notifications











