శ్రీముఖి హాట్‌హాట్‌గా.. ఇక తాడో పేడో.. రాంగోపాల్ వర్మపై సెటైర్లు

తన టాలెంట్‌తో బుల్లితెర ప్రేక్షకులకు కిక్కెస్తున్న యాంకర్ శ్రీముఖి వెండితెరపై మరోసారి కనువిందు చేయడానికి సిద్ధమైంది. త్వరలో విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో శ్రీముఖి హీరోయిన్‌గా నటిస్తున్న సం

By Rajababu

Recommended Video

Good Bad Ugly Trailer : గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్‌ : శ్రీముఖి హాట్‌హాట్‌గా

తన టాలెంట్‌తో బుల్లితెర ప్రేక్షకులకు కిక్కెస్తున్న యాంకర్ శ్రీముఖి వెండితెరపై మరోసారి కనువిందు చేయడానికి సిద్ధమైంది. త్వరలో విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో శ్రీముఖి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె నటించిన సన్నివేశాలు హాట్‌హాట్‌గా ఉండటంపై సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

శ్రీముఖి హీరోయిన్‌గా

శ్రీముఖి హీరోయిన్‌గా

మాటల రచయిత, నటుడు హర్షవర్థన్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీముఖి ప్రధాన కథానాయిక. ఇటీవలే శ్రీముఖి సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తున్నది.

అందాలతో శ్రీముఖి తడాఖా

అందాలతో శ్రీముఖి తడాఖా

ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకొంటున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్‌లో శ్రీముఖి తన అందాలతో మరోసారి తన తడాఖా చూపింది. చీర కట్టులో ఎలాంటి బిడియం లేకుండా అందాల ఆరబోతకు సిద్ధపడినట్టు ట్రైలర్‌లో స్పష్టమవుతున్నది. ట్రైలర్‌ను పరిశీలిస్తే కథలో భాగంగానే శ్రీముఖ పాత్ర అందాల ఆరబోత ఉంటుంది అనే అర్థమవుతున్నది.

గుడ్ బ్యాడ్ అగ్లీతో శ్రీముఖి..

గుడ్ బ్యాడ్ అగ్లీతో శ్రీముఖి..

టెలివిజన్ తెరపై టాప్ యాంకర్లు రష్మీ, అనసూయలకు ఏమాత్రం తగ్గకుండా శ్రీముఖి రాణిస్తున్నది. గతంలో సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. అయినా అడపాదడపా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపిస్తున్నది. కానీ గుడ్ బ్యాడ్ అగ్లీతో మాత్రం శ్రీముఖి కెరీర్ గ్రాఫ్ మారిపోయేలా కనిపిస్తున్నది.

సినిమానే చిత్ర నేపథ్యంగా

సినిమానే చిత్ర నేపథ్యంగా

ఇక ఈ సినిమా కథ విషయాన్నికి వస్తే 80 దశకంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా గుడ్ బ్యాడ్ అగ్లీని తెరకెక్కించినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం కథ నేపథ్యం సినిమానే కావడం విశేషం. ఎందుకంటే ట్రైలర్‌లో మాటలన్నీ సినిమా చుట్టే తిరుగుతున్నాయి. శివ, గీతాంజలీ చిత్రాల ప్రస్తావన ఉంది. రాంగోపాల్ వర్మ పాత్రను కూడా డిజైన్ చేశారు.

వర్మ, మణిరత్నంపై సెటైర్లు

వర్మ, మణిరత్నంపై సెటైర్లు

గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో రాంగోపాల్ వర్మ, మణిరత్నంపై విపరీతమైన సెటైర్లు వేయడం ట్రైలర్‌లో ఆసక్తి రేపుతున్నది. శివ, మణిరత్నం లాంటి చిత్రాలపై కామెంట్లు చేయడం, ఆ సినిమాలు ఆడితే సగం మీసం తీసేసి తిరుగుతాను అంటూ చాలెంజ్ చేసే సన్నివేశాలను బట్టి చూస్తే ఏదో ఆసక్తికరమైన కథనే చిత్రీకరించినట్టు తెలుస్తున్నది.

 మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా

మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా

గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి కేవలం దర్శకత్వం బాధ్యతలే కాకుండా హర్షవర్థన్ సంగీత దర్శకుడిగా కూడా మారారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం త్వరలోనే విడుదల కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X