అందుకే సీక్రెట్‌గా ఉంచా.. సపోర్ట్ చేయండి పక్కాగా.. శ్రీముఖి

'బిగ్ బాస్' పై ఎప్పటినుంచో అనుమానాలు, ఆసక్తికర విషయాలు. అసలు ఈ షో ప్రారంభమవుతుందా? లేదా? అనే అపోహలు.. వీటన్నింటి నడుమ ఎట్టకేలకు అట్టహాసంగా మొదలైంది 'బిగ్ బాస్' షో. ఈ రియాలిటీ షోలో పాల్గొనే కంటిస్టెంట్ల విషయంలో ఉన్న సస్పెన్స్.. షో ప్రారంభమయ్యేంత వరకు అలాగే కొనసాగింది. అయితే ఈ షోలో శ్రీముఖి ఉందా.. లేదా? అని బిగ్ బాస్ స్టార్ట్ కాగానే టీవీలకు అతుక్కుపోయిన జనానికి ఆమె దర్శనం మంచి కిక్ ఇచ్చింది.

 బిగ్ బాస్‌లో శ్రీముఖి అంటూ

బిగ్ బాస్‌లో శ్రీముఖి అంటూ

నిజానికి ఎప్పటినుంచో 'బిగ్ బాస్' లో శ్రీముఖి కన్ఫర్మ్ అయిందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఎప్పుడూ వీటిపై శ్రీముఖి స్పందించలేదు. అయితే ఆ వార్తలపై ఎందుకు స్పందించలేదనే విషయాన్ని చెబుతూ తాజాగా ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది శ్రీముఖి.

కొన్ని కండీషన్స్ ఉన్నాయి అందుకే

కొన్ని కండీషన్స్ ఉన్నాయి అందుకే

బిగ్ బాస్ కంటిస్టెంట్ గా వెళ్తున్న విషయం వాస్తవమే.. ఎన్నోసార్లు మీరు కూడా అడిగారు. అవును నిజమే. కానీ ఇన్ని రోజులు ఎందుకు దాచానంటే.. బిగ్ బాస్ మేనేజ్మెంట్ పెట్టిన కండీషన్స్ ప్రకారం దాచక తప్పలేదు. ఈ వీడియో మీరు చూస్తున్న సమయానికి మా ఎంట్రీ అయిపోయి ఉంటుంది.. అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా అని పేర్కొంది శ్రీముఖి.

ప్రామిస్ చేస్తున్నా.. సపోర్ట్ చేయండి

ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తానని హామీ ఇస్తున్నా. ఇప్పటిదాకా నన్నెలాగైతే ఆదరించారో, పేమించారో అలాగే ఇప్పుడు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటర్‌‌టైన్‌మెంట్‌తో పక్కా అని హుషారుగా చిటికె వేస్తూ చెప్పింది శ్రీముఖి. మరోవైపు బిగ్ బాస్ విషయంలో ఇప్పటికే శ్రీముఖి ఆర్మీలు సిద్ధమవటం విశేషం.

 బిగ్ బాస్ ఎంట్రీపై నాగార్జున సూటి ప్రశ్న

బిగ్ బాస్ ఎంట్రీపై నాగార్జున సూటి ప్రశ్న

బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్‌ శ్రీముఖిని ఆహ్వానించిన నాగ్‌.. ఆమెను సూటిగా ఓ ప్రశ్న అడిగారు. 'పాపులర్‌ యాంకర్‌ అయిన నువ్వు వారంలో అన్ని రోజులూ బిజీగా ఉంటావు. నీకు తీరిక సమయమే ఉండదు. అలాంటిది అవన్నీ వదిలి పెట్టి బిగ్‌బాస్‌ హౌస్‌కు ఎందుకు వచ్చావు?' అని అడిగారు. దీనిపై స్పందించిన శ్రీముఖి.. 'బిగ్‌బాస్‌ కాన్సెప్ట్‌కు నేను పెద్ద అభిమానిని. బిగ్ బాస్ హౌస్ లోకి రావడం నా అదృష్టం. అందుకే నాకున్న ఇతర కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి వచ్చేశాను' అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X