ఒకేసారి ముగ్గురు అంకుల్స్‌తో శ్రీముఖి.. RRR టైటిల్ పెట్టాలని అనుకున్నారట..ఎందుకంటే

బుల్లితెరపై యాంకర్స్ అనే పదానికి సరికొత్త అర్దాన్ని చెప్పిన వారిలో శ్రీ ముఖి ఒకరు. అల్లరిగా తన మాటలతో ఆకట్టుకోవడమే కాకుండా అప్పుడప్పుడు గ్లామర్ తో కూడా హీటేక్కిస్తు ఉంటుంది. మిగతా యాంకర్స్ రేంజ్ ఎలా ఉన్నా కూడా శ్రీ ముఖి తన రేంజ్ కి తగ్గట్లుగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే గట్టిగానే పెంచుకుంది. ఇక అప్పుడప్పుడు శ్రీ ముఖి ఎవరు ఊహించని సినిమాలను ఎనౌన్స్ చేస్తు షాక్ ఇస్తోంది.

అంకుల్స్ తో శ్రీముఖి రొమాన్స్..

అంకుల్స్ తో శ్రీముఖి రొమాన్స్..

ఆడియెన్స్ అయితే శ్రీ ముఖిని ఒక రేంజ్ లో చూస్తారు. కాని ఆమె కొన్నిసార్లు ఎంచుకునే ప్రాజెక్టులు మాత్రం అంచనాలను అందుకోవడం లేదు. ఇక ఇప్పుడు క్రేజీ అంకుల్స్ అంటూ ఒక కొత్త తరహా సినిమాతో ఆకట్టుకోవాలని చూస్తోంది. మిడిల్ ఏజ్ అంకుల్స్ తో ఆమె రొమాన్స్ చేయనుంది అనేట్టుగా ఇప్పటికే కొన్ని కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒకేసారి ముగ్గురు అంకుల్స్ తో..

ఒకేసారి ముగ్గురు అంకుల్స్ తో..

శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న క్రేజీ అంకుల్స్ సినిమా ఎలా ఉంటుందో గాని శ్రీ ముఖిని మెయి లీడ్ లో తీసుకోవడంతో ఒక రకమైన బజ్ అయితే క్రియేట్ అయ్యింది. ఒకేసారి ముగ్గురు అంకుల్స్ ఆమె వెంబడి పడినట్లు సినిమా పోస్టర్స్ తో బజ్ క్రియేట్ చేస్తున్నారు. రాజా రవీంద్ర, భరణి వంటి సీనియర్ నటులతో పాటు సింగర్ మనో కూడా అంకుల్స్ లలో ఒకరిగా ఉండడం వైరల్ అవుతోంది.

శ్రీ ముఖి ఎందుకు ఒప్పుకుందంటే..

శ్రీ ముఖి ఎందుకు ఒప్పుకుందంటే..

యాంకర్ గా బిజీగా ఉంటూనే శ్రీ ముఖి తనకు నచ్చినప్పుడు వరుసగా సినిమాలు కూడా చేస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈవెంట్స్ ను నిర్వహించే శ్రేయస్ మీడియా సినిమాను నిర్మిస్తుండడంతో శ్రీ ముఖి వాళ్ళ మీద నమ్మకంతో సినిమా చేయడానికి ఒప్పుకుందట. ఇక సినిమాలో అంకుల్స్ తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అనే కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
RRR టైటిల్ అనుకున్నారట..

RRR టైటిల్ అనుకున్నారట..

ఇక సినిమాకు క్రేజీ అంకుక్స్ అనే టైటిల్ కంటే ముందుగా RRR టైటిల్ పెట్టాలని అనుకున్నారట. ఆర్ఆర్ఆర్ అంటే.. రెడ్డిగారు, రాజగారు, రవిగారు అని దర్శకుడు ఇ. సత్తిబాబు వివరణ ఇచ్చాడు. ఇంతకుముందు ఈ దర్శకుడు అల్లరి నరేష్ తో బెట్టింగ్ బంగార్రాజు, జంప్ జిలానీ అనే సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు శ్రీ ముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రేజీ అంకుల్స్ తో రాబోతున్నాడు. మరి ఈ సినిమా ఏలాంటి రిజల్ట్ ని అందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X